Kuushboo.. ఒకప్పటి అందాల నటి.. నేటి బిజెపి మహిళా నేత ఖుష్భూ.. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమెకు కీలక పదవి దక్కినట్లు తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికైంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఖుష్బూపై ప్రశంసల వర్షం కురిపించారు. “జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్బు కు నా శుభాకాంక్షలు.. మీరు కచ్చితంగా ఈ పదవికి అర్హులు.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మీరు మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ.. సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను . మహిళా సమస్యలపై పోరాడుతున్న మీ గొంతుక మరింత శక్తివంతంగా మారాలి” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇకపోతే ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Very happy for you @khushsundar !
You most certainly deserve this position. Trust your presence as a member in the @NCWIndia will ensure greater focus on & more efficient redressal of all relevant issues pertaining to women & empower their voice even more.Wishing you the Best! https://t.co/zHT7HILsZz— Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023