Krishnamraju : కూతురు అలాంటి పని చేయడంతో రూ.100కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు..!!

Krishnamraju : రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు చిత్రసీమ రంగానికి సినీ దిగ్గజంగా, గొప్ప నటుడిగా.. విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన కృష్ణంరాజు.. నిర్మాతగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్య కారణంతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయన మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు దేశ రాజకీయ వ్యవస్థకు కూడా తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఇకపోతే ఆయన మరణించిన రోజు నుంచి ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన, అలాగే వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు. ఇక ప్రభాస్ సినీ వారసుడు ప్రభాస్ మాత్రమే కాదు ఆయన పెద్ద కూతురు సాయి ప్రసీదా కూడా. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నిర్మాతగా రాణిస్తోంది . ప్రొడ్యూసర్ గా మారి తన అన్న నటించిన సినిమా రాధే శ్యామ్ కి నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో విడుదలైన విషయం తెలిసిందే. ఎంత అంటే ఏకంగా రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టి ఈ సినిమాను నిర్మించారు.. భారీతారాగణం, భారీ బడ్జెట్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై భారీ డిజాస్టర్ ను చవిచూసింది.

Krishna Raj lost Rs 100 crores because his daughter did such a thing
Krishna Raj lost Rs 100 crores because his daughter did such a thing

అంతేకాదు తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమా విజయవంతం అవ్వాలని సాయి ప్రసీదా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ దురదృష్టవశాస్తూ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమాకు రూ.350 కోట్లు పెట్టుబడి పెడితే రూ. 100 కోట్ల వరకు నష్టం మిగిల్చింది. సాయి ప్రసీద మొదటి సినిమా కావడం ఈ సినిమా దురదృష్టవశాత్తు నష్టాలను చవిచూడడంతో కృష్ణంరాజు తన వంతుగా రూ.100 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇక కనీసం ఇప్పటికైనా సాయి ప్రసీద ఆచితూచి అడుగులు వేయాలి అని, మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకోవాలని వారి అభిమానులు కోరుతున్నారు.

Advertisement