Kodi Kathi Case : దాడికి ముందు జగన్ తో…. కోడి కత్తి శ్రీనివాస్ సంచలన నిజాలు….??

Kodi Kathi Case : కోడి కత్తి కేసు అనగానే మనకు గుర్తొచ్చేది ఏపీ సీఎం జగన్. ఎందుకంటే ఆయన మీదే హత్యాయత్నం జరిగిందని ఆ రోజుల్లో వైసిపి నానాహంగామ చేసింది. ఎన్నికలు ముందు కావడంతో జనం కూడా అదే ఊపులో జగనే చంపాలనుకున్నారని నమ్మారు.కొంతమంది బంగారం లాంటి జగన్ ను రాజన్న కొడుకును ఓడించలేక చంపాలనుకుంటున్నారా..?అంటూ ఓట్లు కూడా వేశారు. మరోవైపు ఇది డ్రామా కోడి కత్తితో ఆటలాడే ఆసుపత్రిలో జగన్ పెద్ద పర్ఫామెన్స్ చేశారని టిడిపి చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆరోపించారు.ఇటు వైసిపి మాత్రం ఇది టిడిపి కుట్టే అని అన్నారు. దీంతో ఆరోపణలు ప్రతి ఆరోపణలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి కోడి కత్తి కేసు మీదకి వెళ్లాయి.చివరకు హాస్పటల్లో స్ట్రక్చర్ పై పడకున్న జగన్ ఫోటో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో వైసిపి బంపర్ మెజార్టీతో గెలిచింది.

Advertisement

Advertisement

కోడి కత్తి తో జగన్ని పొడిచిన జనపల్లి శ్రీనివాసరావు చొప్పిన 160 సీట్ల కంటే తొమ్మిది తక్కువ వచ్చాయి. అయితే జగన్ సీఎం అయినా కూడా ఈ కేసు గురించి తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఈ కేసు ఎన్ఐఏ కి అప్పగించిన తర్వాత అసలు విషయం బయటపడింది. అదే సీఎం వైయస్ జగన్ ఓట్ల కోసం కోడి కత్తి తో పొడిపించుకోలేదు. మరోవైపు టిడిపి కూడా కుట్ర చేసి జగన్ ని చంపించాలి. అనుకోలేదు మరేం జరిగిందంటే కునిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన సంచలన వాంగ్మూలంలో అసలేముందో చూద్దాం….

2019 జనవరి 17న శ్రీనివాస్ రావు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం చెప్పాడు. శ్రీనివాసరావు నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వీరాభిమానిని ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాలాంటి వారికి ఎంతో లాభం కలిగేలా చేశాయి.నాకు వైఎస్ దేవుడు లాంటివాడు. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ కి నేను పెద్ద అభిమానిగా మారాను. తండ్రిలాగే మంచి పాలన చేసి ఆంధ్రప్రదేశ్ కి మంచి చేస్తారని భావించాను. జగన్ మీద నా అభిమానాన్ని చూపేలా 2018 జనవరి 21 న కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జగన్ ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ తయారు చేయించి మా ఊరిలో పెట్టించాను. జగన్ కి సానుభూతి కలిగించేలా పెద్ద పని చేయాలని అనుకున్నాను. అప్పుడే కోడి కత్తి ఆలోచన వచ్చింది. భుజాలపై కోడి కత్తి తో దాడి చేస్తే జగన్ కి ప్రాణాపాయం ఉండదు.జనాల్లో సానుభూతి కలిగేలా ఉండాలని ఇప్పుడే నా సందేశం జగన్ కు చేరుతుంది. అప్పుడే జగన్ కి అత్యా ప్రయత్నం జరిగిందని ఓట్లు వేస్తారని అనుకున్నాను. అతనికి ఏ విధంగా హాని జరగకూడదని ఉడుకు నీళ్లలో ఆ కత్తిని ఉడికించి అతను భుజం మీద పొడిచాను అంటున్న శ్రీనివాస్.

Advertisement