ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి లెటర్లు రాసి నిజాలు బయటపెట్టిన కోడి కత్తి శ్రీను…

రాజమండ్రి జైలు అధికారులు కోడికత్తి శ్రీనుకు రక్షణ కల్పించలేకపోతున్నామని ఇటీవల కామెంట్ చేశారు. అతడిని విజయవాడకి తరలించాలని పోలీసులు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అయితే విజయవాడ పోలీసులు కూడా అతడిని తమ జైల్లోకి అనుమతించేందుకు ఒప్పుకోవడం లేదు. దీనికి కారణం అతడి ప్రాణానికి ప్రమాదం ఉందా అనే కోణంలో ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక అడ్వకేట్ కోడి కత్తి శ్రీను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కరుడుగట్టిన నేరస్తుడిగా కోడి కత్తి శ్రీనుని ఎన్ఐఏ కేసులో జగన్ ఇరికించారని అసహనం వ్యక్తం చేశారు. దుబాయ్ లో ఉంటున్న శ్రీను అన్నయ్య కూడా తన తమ్ముడికి చాలా అపాయం ఉందని, అతడికి సహాయం చేయాలని లాయర్‌ను కోరుతున్నారట.

ఎందుకంటే శ్రీనుని చాలా కరుడుగట్టిన నేరస్తుల సెల్లులో వేశారట. మొద్దు శీను లాగా శ్రీను పరిస్థితి కూడా అయ్యే ప్రమాదం ఉందని అడ్వకేట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం శ్రీను అన్నయ్యకి తెలిసిన తర్వాత, తమ్ముడిని విజయవాడ జైలుకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ చాలామందిని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ఇదే విషయమై కోడి కత్తి శ్రీను అన్నయ్య తనతోపాటు చాలా లెటర్లను లాయర్లకు రాసినట్లు పేర్కొన్నారు. చిన్న గాయానికి ఎన్ని రోజులు శిక్ష వేయడం అన్యాయం అని పేర్కొన్నారు.

ఇక బాధితుడిని కుటుంబ సభ్యులకు కూడా జగన్ కు ఏమాత్రం కనికరం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు అడ్వకేట్ వెల్లడించారు. ఏ కోడి కత్తి వల్ల సానుభూతి పొంది జగన్ సీఎం అయ్యారు ఇప్పుడు అదే కోడి కత్తి వల్ల అతను ఆ పదవి దిగుతారని వారు కామెంట్లు చేస్తున్నారట. శ్రీనుకు న్యాయం జరిగేందుకు పవన్ కళ్యాణ్ ని కూడా కలిసేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట.

https://www.youtube.com/watch?v=v7rRDiqhI6s