KL Rahul: పెళ్లి చేసుకున్న తరవాత రోజే KL రాహుల్ కి బిగ్ ట్విస్ట్ !

KL Rahul: టీమిండియా స్టార్ క్రికెటర్ బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి జనవరి 23న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిది ప్రేమ వివాహం. కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలోకంలో విహరించింది. కూతురి పెళ్లి తర్వాత మీడియాతో ముచ్చటించిన సునీల్ శెట్టి వారికి స్వీట్లు తినిపించారు.. ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో అతియా, రాహుల్ దండలు మార్చుకున్నారు.

Advertisement
KL Rahul Athiya Shetty married life big twist
KL Rahul Athiya Shetty married life big twist

అతియా శెట్టి తన ఇంస్టాగ్రామ్ లో వారి పెళ్లి ఫోటోలను పంచుకుంటూ ప్రేమ బంధం లో ఎలా ముందుకు వెళ్లాలో నిన్ను చూసే నేర్చుకున్నాను.. మన బంధం కలకాలం ఇలాగే ఉండాలి.. అందుకు మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి అంటూ అతియ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

కేఎల్ రాహుల్ అతియా శెట్టి గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని గ తేడాది సునీల్ వెల్లడించారు వీరి ప్రేమను ఆమోదిస్తున్నట్లుగా కూడా ఆయన అప్పట్లో తెలిపారు వీరిద్దరి పెళ్లి సుమారు 100 మంది అతిధుల మధ్య జరిగింది క్రికెట్ రంగానికి చెందిన వారితో పాటు సల్మాన్ ఖాన్, జాకీశ్రాఫ్ ,ఎంఎస్ ధోని, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ తదితరులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..

కేఎల్ రాహుల్ అతియా శెట్టి పెళ్లి జరిగి రెండు రోజులు కాలేదు.. ఇంతలోనే కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా దేశవాళీ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనేందుకు టెస్ట్ జట్టులో చేరనున్నాడు. అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయకుండానే ఆస్ట్రేలియా దేశవాళీ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు కే ఎల్ రాహుల్ అని తెలుస్తుంది.

Advertisement