Khushboo Sundar.. నటి ఖుష్బూ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటిగా తన కెరీయర్ ను ప్రారంభించిన ఈమె కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత వరుస అవకాశాలతో దక్షిణాది స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. హీరోయిన్ నుంచి రిటైర్ అయ్యాక సపోర్టింగ్ యాక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి రియాక్ట్ అయ్యింది.
చిన్నతనంలో తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలు బయట పెట్టింది ఖుష్బూ. తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఖుష్బూ వెల్లడించింది. అయితే అప్పుడు తన వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే అని 15 ఏళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించానని కూడా ఆమె తెలిపింది. దాంతో తన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడని ఖుష్బూ వెల్లడించింది. ఇకపోతే తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు దిగాడు అని తెలిసి ఖుష్బూకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు అంటూ అభిమానులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.