Love Story : ప్రేమించిన అమ్మాయిని ఇంట్లోనే దాచి , అమ్మా నాన్న కి తెలియకుండా 11 సంవత్సరాలు .. ఇదేమి లవ్ స్టోరీ రా నాయనా !

Love Story : ప్రేమించిన వారితోనే జీవితాంతం బ్రతకాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. అబ్బాయి కూడా నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయిని తోనే జీవితాంతం నడవాలని అనుకుంటాడు.. ఇది నిజమైన ప్రేమ కథ.. ఇప్పుడు అలాంటి నిజమైన ఓ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం..

కేరళలోని పాల్గట్ జిల్లాలో ఒకే వీధిలో రెహమాన్ సజిత ఉండేవాళ్ళు.. రెహమాన్ ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆమె ఇంటి ముందు నుంచే సైకిల్ మీద తన షాపుకి వెళ్లేవాడు.. ఒకరోజు రెహమాన్ షాప్ కి సజిత వెళ్ళింది. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సజిత తండ్రికి ఆ ఊరిలో మంచి పేరు గౌరవం ఉంది. రెండేళ్లు వీళ్ళిద్దరూ భయం భయంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు. అందుకే సజిత తన స్నేహితులకు కూడా రెహమాన్ ను ప్రేమిస్తున్న సంగతి

చెప్పలేదు.

రెహమాన్ ఉంటున్న ఇంట్లో రెండు గదులు ఉంటాయి. తన గదిలోకి ఎవ్వర్నీ రాకుండా ఉంచడం కోసం తను ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. దాంతో ఇంట్లో ఎవ్వరూ కూడా తన గదిలోకి రాలేదు. అలా రెండు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఉదయం తెల్లవారుజామున సజితను తీసుకువచ్చి తన గదిలో ఉంచాడు. పైగా తను ఉండే గదికి తాళం వేసుకోవటంతో పాటు ఆగది తీయాలని ప్రయత్నించకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్ సప్లై అయ్యేలాగా చూశాడు.. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. ఇక తన షాప్ కి వెళ్లి తన పని తాను చేసుకునేవాడు. సజిత ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదు. ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెహమాన్ ని కూడా అనుమానించారు. కానీ సజిత ఎక్కడా కనిపించలేదు. ఇక సజితను తన గదిలోనే ఉంచి తను తినే ఆహారంలో సజిత కి కొంత పెట్టి లేదంటే.. మొత్తం తనే తినేసాక తను బయట తినేవాడు. ఇక తన ఇంట్లో నుంచి బాత్రూం కి వెళ్లే లాగా ఒక మర కిటికీని చేసి పెట్టాడు. ఉదయం నాలుగు గంటలకే సజిత నిద్రలేచి స్నానం చేసేది.

తన ఇంట్లో తన తల్లిదండ్రులు కూడా నెలకి 25 రోజులు కూలీ పనుల మీద బయటకు వెళ్తుండేవారు. దాంతో రెహమాన్ తన పని చాలా సులువైంది. ఇక తన చెల్లెలు ఒక్కటే తన ఇంట్లో ఉండేది. తను కూడా స్కూల్ కి వెళ్ళిపోవటంతో సజిత ఇంట్లో ఎవరూ లేకపోయినా ఒంటరిగా తన గదిలో ఉంటూనే టీవీ చూసుకుంటూ ఉండేది. సజిత కోసం కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. రెహమాన్ ఇలా 2021 జూన్ 10 వరకు అంటే సుమారు 11 సంవత్సరాల పాటు ఇలాగే జరిగింది. ఆ తరువాత రెహమాన్ నా భార్యను తీసుకొని నేమర వెళ్లిపోయాడు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి ఎవరికీ చెప్పలేదు దాంతో తన తండ్రి రెహమాన్ మీద దిగులు వేసుకొని మంచాన పడ్డాడు. ఇక తన పెద్దన్నయ్య ఒక రోజు నేమర ఊర్లోకి వెళ్ళగా రెహమాన్ తన హెయిర్ స్టైల్ మార్చేసి టోపీ పెట్టుకుని కనిపించడు ఇక తన తమ్ముడు అనుకుని దగ్గరికి వెళ్లి పలకరించాడు. ఇక అన్నకి జరిగిందంతా రెహమాన్ వివరించి చెప్పాడు. దాంతో అసలు కథ బయటికి వచ్చింది.

Kerala true love story on 11 years in house sajitha rehaman
Kerala true love story on 11 years in house sajitha rehaman

ఈ విషయాన్ని రెహమాన్ వాళ్ళ అన్నయ్య పోలీసులు చెప్పడంతో రెహమాన్ సజితను ఇద్దరూ కలిసి పోలీసులు విచారించారు. ఇద్దరు ఒకే విషయం చెప్పడంతో.. ఈ కేసు కోర్టులో విచారణకు కూడా వచ్చింది. ఇక జడ్జి కూడా సజితను పర్సనల్ గా పిలిచి నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తావా రెహమాన్ తో ఉంటావా అని అడగగా .. రెహమాన్ తోనే ఉంటానని చెప్పింది. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. సజిత తండ్రి కూడా తన జీవితం తన ఇష్టం అని నవ్వుతూ ఒప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా సంతోషంగా ఉన్నారు. రెహమాన్ నా ప్రేయసిని 11 ఏళ్లు ఎవ్వరికి కనిపించకుండా దాచి ఉంచడం మామూలు విషయం కాదు. అన్ని సంవత్సరాలలో కూడా సజితను రెహమాన్ ఒక్క మాట కూడా అనలేదంట. పైగా తనని కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడట.