Karthika Deepam 25 Oct Episode : దీప జోలికి వస్తె ఊరుకోనన్న కార్తీక్.. కంగారు పడుతున్న వాల్తేరు వాణి..

Karthika Deepam 25 Oct Episode : వదిన ఆ మోనిత నిన్ను అంత మోసం చేసిందా అని వాణి అంటుంది.. నీకు బిజినెస్ లో 20 లక్షలు నష్టం వచ్చిందని తనమీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నావు.. కానీ నాకు నా భర్త ను దూరం చేసింది నేను ఏం చేయాలి అని దీప అంటుంది.. చంపేయలి అని వాణి అంటుంది.. దీప వాల్తేరు వాణికి థాంక్స్ చెబుతుంది.. నువ్వు కూడా దుర్గ లాగా నాకు అండగా ఉండటం చాలా సంతోషంగా ఉంది అని దీప అంది.. నమ్ము నువ్వు నన్ను ఎంత గుడ్డిగా నమ్మితే నా పని అంత సులువుగా అవుతుంది అని వాల్తేరు వాణి మనసులో అనుకుంటుంది..

Advertisement
karthika-deepam-25-oct-today full episode
karthika-deepam-25-oct-today full episode

కార్తీక్ నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు.. నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని మోనిత అంటుంది.. నువ్వు చేస్తున్న పనులు ఎదుటివాళ్ళు చేస్తే నీకు

Advertisement

తప్పుగా అనిపిస్తుందా 

అని కార్తీక్ అడుగుతాడు.. నిన్ను ప్రేమించడం తప్ప వేరేది చూపించే అవకాశం ఎప్పుడు రాకూడదు అని కోరుకుంటాను కార్తీక్ అని మోనిత అంటుంది.. నన్ను ఆ దుర్గని కలిపి వేలెత్తి చూపిస్తున్నావు.. మరి నువ్వు ఆ వంటలక్క చేసేది ఏంటి అని మోనిత కార్తీక్ ను నిలదీస్తుంది.. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని మోనిత అంటుంది.. ఈమధ్య మీరిద్దరూ కలిసి బయటి తిరగడం, కార్లో తిరగడం, వంటలు చేయడం బాగా ఎక్కువైంది.. నీకు ఎలాగూ సిగ్గులేదు దానికి కూడా సిగ్గులేదు అని మోనిత అంటుండగా.. మోనిత కార్తీక్ పెద్దగా అంటాడు.. వంటలక్కని నువ్వు ఒక్క మాట అంటే ఊరుకోను అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు మోనిత కి..

వాల్తేరు వాణి దుర్గని బుట్టలో వేసుకోవాలి అని డిన్నర్ కి వెళ్దాం రమ్మని పిలుస్తుంది.. ఇంతవరకు నేను ఏ అమ్మాయితో కూడా ఇంత క్లోజ్ గా మాట్లాడలేదు .. నాకు అసలు ఆడవాళ్ళు అంటేనే ఇష్టం లేదు అని దుర్గా అంటాడు.. డిన్నర్ కి వెళ్తే బాగుంటుంది కదా అని వాణి మళ్లీ అంటుంది.. ఇప్పుడు కాదులే నేను ఆలోచించుకొని చెబుతాను అని దుర్గా అంటాడు.. వాల్తేరు వాణి మోనిత ను కలిసి అక్కడ చేయబోయే విషయాల గురించి మాట్లాడుతుంది.. అప్పుడే దుర్గ డిన్నర్ కి రమ్మని కాల్ చేస్తాడు వాణికి.. సరే వస్తున్నాను అని చెబుతుంది వాణి.. ఆ దుర్గా నా ట్రాప్ లో పడిపోయాడు అని వాణి చెబుతుంది..

వాల్తేరు వాణి మోనిత దగ్గరకు వచ్చి పని అయిపోతుంది రెండు రోజుల్లో అని చెబుతుంది.. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.. చేసి చూపిస్తాను అని మోనిత అంటుంది.. దీప వాళ్ళ ఇంటికి వచ్చిన మోనిత

చూసిన వాణి పోవే ఇక్కడి నుంచి అని అరుస్తుంది.. మా అన్నయ్య నీ దగ్గరకు రావాలని అనుకున్నప్పుడు వస్తాడు.. అంతేకానీ నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే నేను అస్సలు ఊరుకోను అని వాణి మోనిత మీద అరుస్తుంది  .. ఆ మాటలు విన్న కార్తీక్.. దీప ఇక నాకు ధైర్యంగా ఉంది ఎందుకంటే ఇక్కడ నీకు తోడుగా వాణి ఉందిగా అని అంటాడు.. వాణి దీప ను చూసుకునే బాధ్యత నీది అంటాడు.. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మీరు నన్ను నమ్ముతున్నారు నమ్మండి అని వాణి మనసులో అనుకుంటుంది..

దీప చేసిన టిఫిన్ లో విషం కలుపుతుంది వాణి.. దీప దుర్గా ఆ టిఫిన్ తింటుండగా కార్తీక్ అక్కడ వస్తాడు.. కార్తీక్ కి దీప ఆ విషం కలిపిన టిఫిన్ పెడుతుంది.. ఈ టిఫిన్ తింటే కార్తీక్ కచ్చితంగా చనిపోతాడు వాణి మనసులో అనుకుంటుంది  అలా జరగకూడదు.. దీప, దుర్గ మాత్రమే చనిపోవాలి అని అనుకుంటుంది వాణి.. దుర్గ ఇచ్చిన టిఫిన్ తింటుండగా వాణి కోపంగా వచ్చి దుర్గా చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ ను లాక్కుంటుంది.. నువ్వు టిఫిన్ చేయట్లేదు కదా అని ఇంకా నేను కూడా చేయొద్దా అని దుర్గా అడుగుతాడు అబ్బే అదేం లేదు అన్నయ్య కూడా వచ్చాడు కదా ఇద్దరు కలిసి తింటారు అని అంటుంది.. ఇద్దరు ఒకేసారి టిఫిన్ తింటే బాగుంటుంది అని.. కరెక్ట్.. రండి కార్తీక్ సార్ అని దుర్గ అంటాడు.. వాల్తేరు వాణి సీరియస్ గా వాళ్లిద్దరి వైపు చూస్తుంది.. ఇక మిగతా విషయాలు తరువాయి భాగంలో చూద్దాం..

Advertisement