Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడు హాట్ మ్యాటరే.. ప్రభాస్ నీ పెళ్ళెప్పుడు అని అడిగేవారే ఎక్కువ.. అయితే కరణ్ జోహార్ అందుకు భిన్నంగా నీకు నేను మ్యాచ్ చూశాను.. ఆ అమ్మాయిని చేసేసుకో అని ప్రభాస్ కి సలహా ఇచ్చాడట కరణ్ జోహార్..

కరణ్ జోహార్ పెళ్లి కానీ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ను తీసుకువచ్చి.. ప్రభాస్ ను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడంట. ఆ సీనియర్ హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోలు అందరూ సరసన నటించిందట. అయితే ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదట. తను అయితే నీకు పర్ఫెక్ట్ జోడీ అని కరణ్ జోహార్ అనగానే.. ఆ పక్కనే ఉన్న ప్రభాస్ స్నేహితులు ప్రభాస్ ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్ తో లవ్ ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలీదా అన్నాడట. ఆ మాటలకు మీకో దండం రా బాబు.. నా పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో జరుగుతుంది. దానికి ఇంకా చాలా టైమ్ ఉండి.. నన్ను వదిలేయండి రా బాబు అంటూ ప్రభాస్ అక్కడి నుండి వెళ్ళిపోయాడట.