K.Viswanath.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి రెండవ తేదీన కళాతపస్వి కే విశ్వనాథ్ స్వర్గస్తులవగా ఆ విషాద వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాథుని జయలక్ష్మి గత కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కే విశ్వనాథ్ స్వర్గస్తులైనప్పటినుంచే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై గత కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని చికిత్స పొందుతున్నారు. అయితే అనారోగ్య పరిస్థితులు విషమించడంతో ఈరోజు సాయంత్రం 6:15 నిమిషాల సమయంలో ఆమె తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇకపోతే తమ తండ్రికి విశ్వనాథ్ స్వర్గస్తులైన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా శివైక్యం చెందడం దురదృష్టకరమని వారు ఆ ప్రకటనలో వెల్లడించారు. కొద్దిసేపట్లో ఫిలింనగర్ ప్రాంతంలో తమ ఇంటికి తరలించనున్నారు. రేపు పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత వయసు 88 సంవత్సరాలు 15 ఏళ్ల వయసులోనే కె విశ్వనాథ్ వివాహం చేసుకుంది. అయితే ఆయన స్వర్గస్తులైన తర్వాత ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె మంచానికే పరిమితమై ఇప్పుడు కాలం చేశారు.