Money : కేవలం మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందా.. నేరుగా మన ఖాతాలో డబ్బు జమ అవుతుందా.. ఇదేంటి అని ఆలోచిస్తున్నారా.. అలా ఆలోచించేవారికి దేశీయ దిగ్గజం బ్యాంకింగ్ కంపెనీ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త తీపికబురు ను తీసుకొచ్చింది.. ముఖ్యంగా హోమ్ లోన్ పొందాలని ఆలోచించే వారికి కేవలం మిస్డ్ కాల్ ద్వారా లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడం అంటే మామూలు విషయం కాదు .. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇక సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మీ సొంత ఇంటి కలను సహకారం చేసుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీ సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అంటే చేతిలో డబ్బులు లేవని మీరు ఆలోచిస్తున్నట్లు అయితే అలాంటి వారికి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు.. సులభంగానే ఎస్ బి ఐ ద్వారా లోన్ పొందే అవకాశాన్ని కల్పించబడింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్హత కలిగిన కస్టమర్లకు సులభంగానే హోమ్ లోన్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. అంతే కాదు కొన్ని రకాల బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం. ఎస్బిఐ నుంచి హోమ్ లోన్ పొందాలని అనుకునేవారికి జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. కేవలం ఐదు రోజుల్లోనే మీరు లోన్ పొందవచ్చు ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే టాప్ అప్ పొందే అవకాశం ఉంటుంది.

ఇకపోతే ఎస్బిఐ నుంచి హోమ్ లోన్ పొందాలని భావించేవారు ఎస్బిఐ వెబ్సైట్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా 1800 11 2018 నంబర్ కు కాల్ చేసి అవసరమైన సమాచారాన్ని అయినా పొందవచ్చు లేదా 07208933140 అని నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. ఇక వారే నీకు రిటర్న్ కాల్ చేసి హోమ్ లోన్ ఒక పూర్తి వివరాలు దరఖాస్తు వంటి అన్ని విషయాలను అడుగుతారు ఇక నుంచి పై వడ్డీ రేటు 6.7 శాతం నుండి ప్రారంభమవుతుంది అయితే ఈ క్రెడిట్ స్కోర్ ని బట్టి లోన్ పొందే అవకాశం ఉంటుంది.