పనిమనిషి కూతురి పెళ్లికి రూ.20 లక్షలు ఆర్థిక సహాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్… 

జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ తెలుగు నటుడు. సహజమైన నటనతో ఏ పాత్రనైనా అద్భుతంగా పోషించగల సమర్థుడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో ఫ్యాన్స్ ని సంపాదించిన ఈ హీరో ఇటీవల తన ఇంట్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న పనిమనిషికి మర్చిపోలేని ఒక గొప్ప సహాయం చేశాడు. ఆమె కూతురు పెళ్లి బాధ్యతలు తానే తీసుకున్నాడు. పనిమనిషి కూతురు ఒక పేద కుటుంబానికి చెందినది. ఈ విషయం మొదటి నుంచీ తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ వారికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చేస్తుండేవాడు. రీసెంట్ గా పనిమనిషి కూతురు పెళ్లి ఖాయమైంది. ఈ సందర్భంగా తారక్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరపాలని 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు.

పెళ్లి కార్యక్రమాల మొదలు చివరి వరకు అన్నిటిని తానే ప్లాన్ ఆ పనిమనిషి పై ఎలాంటి భారం జరగకుండా చూసుకున్నాడు. పెళ్లికి వెళ్లి కొత్తజంటను ఆశీర్వదించాడు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ సహాయం పనిమనిషి, ఆమె కుటుంబానికి చాలా ఆర్థిక భారాన్ని తగ్గించింది. పనిమనిషి జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె అతనిని ఒక గొప్ప మనిషిగా అభినందించారు. నెలనెలా జీతం ఇవ్వడమే కాక 20 లక్షలు ఇచ్చి తన కూతురు యువరాణిలా పెళ్లి చేసుకునేలా చూసుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

తారక్ చేసిన ఈ సహాయం అతని సహాయ హృదయానికి నిదర్శనం. అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు ఒక గొప్ప మనిషి అనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. తారక్ మంచి మనసుకు మరింత ఫిదా అయిపోయి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

జూ. ఎన్టీఆర్‌కు ఈ పనిమనిషి అంటే చాలా గౌరవమట. ఎందుకంటే ఆమె చాలా విశ్వసనీయంగా ఉంటుందట. ఆమె లక్ష్మీ ప్రణతి తారక జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిందని కూడా అంటుంటారు. అందుకే ఈ యంగ్ టైగర్ కి ఆమె అంటే అంత అభిమానం. అందుకే కూతురి పెళ్లి విషయంలోనే కాకుండా పనిమనిషి కొడుకు చదువు విషయంలో కూడా ఈ హీరో ఆర్థిక సహాయం చేస్తున్నాడు.