Jr. NTR: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా చూసిన తర్వాత మీరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ కూడా జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి, రామ్ చరణ్ కంటే తక్కువగా చూపించడం ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కి రాజమౌళి ఇంత అన్యాయం చేశాడు. కథ అంతా కూడా రామ్ చరణ్ చుట్టూనే నడిపించేశాడు అంటూ చాలా రకాలుగా అభిమానులు రచ్చ చేశారు.

ఇకపోతే ఇందులో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగిందో? లేదో? తెలియదు. కానీ ఈ సినిమా కథను నడిపించేది మాత్రం రామ్ చరణ్ అనడంలో సందేహం లేదు. కానీ ఇద్దరు హీరోలు ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు హెచ్చుతగ్గులు అనేవి కచ్చితంగా ఉంటాయి. అయితే ఆస్కార్ అవార్డుల దగ్గరికి వచ్చేసరికి గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. కానీ ఎక్కడా కూడా రామ్ చరణ్ పేరు వినిపించకపోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ ఖాయం అంటూ ప్రూఫ్ తో సహా నిరూపిస్తున్నారు.
ఎన్టీఆర్ పులితో ఎంట్రీ సీన్ అలాగే ఇంటర్వెల్లో జంతువులతో వచ్చే ఇంట్రో సీన్, సెకండ్ హాఫ్ లో కొమరం భీముడు పాటతో కూడా అకాడమీ సభ్యులను ఎన్టీఆర్ తనవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ కు పడిన ఈ మూడు సీన్స్ ఆస్కార్‌లో చర్చకు తెరతీసాయని అందుకే ఎన్టీఆర్ కు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.
జనవరి 24వ తేదీన ప్రకటించబోయే ఆస్కార్ట్స్ బెస్ట్ యాక్టర్ లిస్టులో ఎన్టీఆర్ పేరు కామన్ అని వెరైటీ మ్యాగజైన్ కూడా రాసుకుంది. యూఎస్ఏ టుడే కూడా ఇదే విషయాన్ని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కు ఆస్కార్ రావడం ఖాయం అని తెలుస్తుంది.