Jobs : ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు లక్షకు పైగా జీతం..!!

Jobs : ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అందిస్తోంది NHPC సంస్థ.. ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది. (NHPC)నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఈ రిక్రూమెంట్ ని భర్తీ చేయనున్నారు. ఇందులో 133 పోస్టుల ఖాళీల భర్తీ అని ప్రకటించడం జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.

NHPC ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుండి ప్రారంభమైంది.. ఈ పోస్టులు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం..https://nhpcindia.com/ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.

jobs Salary of over one lakh for engineering candidates
jobs Salary of over one lakh for engineering candidates

విద్యార్హతలు:జూనియర్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు కి అప్లై చేసుకున్న అభ్యర్థులు.. సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో డిప్లమా లేదా తత్సమాన కలిగి ఉండాలి.జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అర్హత సాధించి ఉండాలి.. ఇక అలాగే రెండేళ్ల డిప్లమా. B.TECH, BE వంటి సాంకేతిక అర్హతలు కలిగి ఉండాలి.జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో తత్సమాన, మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత సాధించి ఉండాలి.

వేతనాలు:జేఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు. నెలకు 29,600 నుండీ 1,19,500 అరకు జీతం అందుతుంది.   ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ-జనవరి 31 2022
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ-ఫిబ్రవరి-21 -2022

దరఖాస్తు:మొదటగా అధికారిక వెబ్సైట్లో http:// nhpcindia.com/లో ఓపెన్ చేయాలి.అక్కడ అభ్యర్థులకు సంబంధించిన అప్లికేషన్ ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది. ఇక అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.