ESIC Jobs : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) లో పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, సూపరిడెంట్ ఖాళీల భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక దరఖాస్తు ప్రక్రియ ఇదివరకే ప్రారంభమైనది.. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏప్రిల్ 12వ తేదీ. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య , జీతభత్యాలు వాటి గురించి తెలుసుకుందాం.

1).ESIC లో మొత్తం ఖాళీల సంఖ్య..93 : ఇందులో సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేడ్-2/సూపరి డెంట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నవి.
2). అభ్యర్థుల వయస్సు : అభ్యర్థులు ఏప్రిల్-12,2022 నాటికి 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
3). జీతభత్యాలు : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు పొందవచ్చు .
4). అర్హతలు : ఆసక్తికరమైన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.. అంతేకాకుండా కామర్స్/లా వంటి వారు కూడా అర్హతలే..ఇక అంతే కాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా చాలా అవసరం.
5). ఎంపిక విధానం : అభ్యర్థులు రాత పరీక్ష రెండు రకాలుగా ఉంటుంది.. మరియు నైపుణ్యాలు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
6). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 12
7). దరఖాస్తు ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల లో OC/BC-అభ్యర్థులకు రూ.500 ,SC,ST, PWD అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అభ్యర్థులకు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్..https://www.esic.nic.in/ లో చూసుకోవచ్చు. అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు తమకు సంబంధించిన పోస్టులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని చేయడం మంచిది.