Jobs : 35,000 వేతనంతో తెలుగు రాష్ట్రం లోనే ఉద్యోగాలు..!!

Jobs : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) లిమిటెడ్ పలు ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).మొత్తం పోస్టుల సంఖ్య..200

2).పోస్టుల వివరాలు: ఫీల్డ్ అసిస్టెంట్ మెయింటెనెన్స్-43, అసిస్టెంట్ మెకానికల్ -90, అసిస్టెంట్ ఎలక్ట్రికల్-35, ఎంసి ఓ గ్రేడ్ 3-10, ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3-07, ప్లాస్టర్ గ్రేడ్ 2-02, క్యూసిఏ గ్రేడ్-3-09 పోస్టులు కలవు..

3). అర్హతలు: పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాలలో ట్రేడులు/సబ్జెక్టులలో ITI, ఇంజనీరింగ్ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.. అంతేకాకుండా సంబంధిత వాటిలో కచ్చితంగా అనుభవం ఉండాలి.

Jobs in the Telugu state with a salary of 35,000
Jobs in the Telugu state with a salary of 35,000

4). అభ్యర్థుల వయస్సు : అభ్యర్థుల వయస్సు 02-3-2022 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

5). జీతభత్యాలు : పోస్టులను అనుసరించి నెలకు రూ.18,100 నుండి రూ.35,040 చెల్లిస్తారు.

6).ఎంపిక విధానం : అభ్యర్థులు ఏ పోస్ట్ కి అప్లై చేశారో ఆ పోస్టుకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడుతూ ఉంటుంది.

7). దరఖాస్తు విధానం:అభ్యర్థులు దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈ అధికార వెబ్ సైట్లు..nmdc.co.in లో చూడవలెను.

ముఖ్యంగా అభ్యర్థులు దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ..2-3-2022 నిర్ణయించడం జరిగింది. అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా తమ మార్కు లిస్టు లను దగ్గర పెట్టుకుని అప్లై చేసుకోవాలి. ఇక ఎగ్జామ్ డేట్ కు సంబంధించి త్వరలోనే అప్డేట్ ను కూడా విడుదల చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అభ్యర్థులు ఎంపిక అయినట్లయితే హైదరాబాదులోనే ఉద్యోగం కలదు.