Jobs : బ్యాంక్ నోట్ ప్రెస్ లో ఉద్యోగాలు..!!

Jobs : భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ , మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 9 విభాగాలలో బ్యాంక్ నోట్ ప్రెస్ లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Jobs in Banknote Press
Jobs in Banknote Press

1).మొత్తం ఖాళీలు పోస్టుల సంఖ్య-81

ఇందులో ఖాళీగా జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ లు కలవు.

2). వయస్సు : అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

3). అర్హతలు : అభ్యర్థులు డిప్యూటీ టెక్నాలజీ/ఫర్ఫెస్ కోటింట్ టెక్నాలజీ/పెయింట్ టెక్నాలజీ/ప్రింటింగ్ టెక్నాలజీ/ఎలక్ట్రిక్ /ఎలక్ట్రానిక్/లెటర్ ప్రెస్ మిషన్ మైండర్/ఐఐటి సర్టిఫికెట్ తో పాటు NCBT నుంచి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.

4). ఎంపిక విధానం : అభ్యర్థులు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందట. అభ్యర్థులు రాత పరీక్ష ఏప్రిల్ నెలలో లేదా మే నెలలో ఉండనుంది.

5). పరీక్ష విధానం : అభ్యర్థులకు మొత్తం 125 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.. ఇందులో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల పాటు పరీక్ష రాయవలసి ఉంటుంది.. ఇందులో టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి.

6). దరఖాస్తు ఫీజు : General/OBC/EWS అభ్యర్థులు 600 రూపాయలు. SC/ST/PWD/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు..200 రూపాయలుగా ఫీజు ఉన్నది.

7). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 28వ తేదీ. ఇక అభ్యర్థులకు ఏదైనా పూర్తి సమాచారం కావాలంటే అధికారిక వెబ్సైట్..https://bnpdewas.spmcil.com/Interface/Home.aspx అనే వెబ్ సైట్ లో చూడవచ్చు.. అభ్యర్థులు ఎవరైనా తమ పూర్తి వివరాలను తీసుకొని అప్లై చేసుకోవాలి.