Jio : జియో వేగంగా విస్తరణ చెందుతున్న టెలికాం దిగ్గజాలలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే రిలయన్స్ జియో గత నెలలో దీపావళి నాటికి ఇండియాలోని మొబైల్ నగరాలలో 5G కనెక్టివిటీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక 2023 డిసెంబర్ నాటికి భారతదేశం మొత్తం 5G కనెక్టివిటీతో అనుసంధానించబడుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ రిలయన్స్ జియో శాటిలైట్ యూనిట్ ని కూడా ఆమోదించింది. అంతేకాదు డి ఓ టి కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను కూడా జారీ చేయడం జరిగింది.
ఇక ఇప్పుడేమో జియో త్వరలో ఇండియాలో గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సేవలను అందించడానికి లాంచ్ చేయనుంది .. జియో ఇంటర్నెట్ సేవలతో పాటు వాయిస్ సేవలను కూడా లాంచ్ చేయవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. ఇకపోతే గతంలో శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ హ్యూజ్ కమ్యూనికేషన్స్ ఇస్రో సహాయంతో భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సాటిలైట్ ఇంటర్నెట్ తో హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలిపింది. ఇక ఈ క్రమంలోని ఇప్పుడు జియో డి ఓ టి అనుమతితో వేగంగా సాటిలైట్ ఇంటర్నెట్లో జియో పనిచేస్తుంది. ముఖ్యంగా రిలయన్స్ జియో సాటిలైట్ యూనిట్ లైసెన్స్ ఉన్న ప్రాంతాలలో మొదట సేవలను విడుదల చేయగలరు. ఇక డేటా తో పాటు వాయిస్ సేవలను కూడా పొందవచ్చు..
ప్రస్తుతం జియో కంటే ముందు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ హ్యుస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహాయంతో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఈ హ్యూస్ కమ్యూనికేషన్స్ మనకు ఇండియా ఇస్రో GSAT – 11, GSAT – 29 కమ్యూనికేషన్ ఉపగ్రహాల సహాయంతో మారుమూల ప్రాంతాల్లో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించబోతోంది జియో.. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా హై స్పీడ్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని కూడా చెబుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ వైర్లకు బదులుగా లేజర్ కిరణాలను ఉపయోగించి అంతరిక్షం నుండి డేటాను బదిలీ చేయవచ్చు. ఇలా త్వరలోనే మారుమూల ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది జియో.