Jio Recharge Plans : డైలీ 2 GB డేటా అందించే బడ్జెట్ జియో రీఛార్జ్ ప్లాన్స్..!

Jio Recharge Plans : ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ జియో కస్టమర్లను , వారి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ ను అందిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది. అందుకే నేడు దేశంలో నెంబర్ వన్ టెలికాం సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ జియో ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రం హోం పేరిట పని చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు 2GB డేటాను అలాగే తక్కువ బడ్జెట్లో లభించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకురావడం జరిగింది. మరి జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ల గురించి ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

Advertisement

రూ.299 రిలయన్స్ జియో ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ఆఫర్ తో మీరు ప్రతిరోజు 2GB చొప్పున 28 రోజులకు గాను 56GB డేటాను పొందుతారు. ఇక ఏ ఇతర టెలికాం సంస్థల కైనా అన్లిమిటెడ్ గా వాయిస్ కాలింగ్ ను పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక వీటితోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ , జియో క్లౌడ్ వంటి జియో యాప్ లను కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement
Jio recharge plans that offer 2 GB data daily Budget 
Jio recharge plans that offer 2 GB data daily Budget

రూ.499 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ కూడా మీకు 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇక ప్రతిరోజు 2GB డేటా చొప్పున 56 GB డేటాను అందిస్తుంది. ఇక డైలీ లిమిట్ అయిపోగానే 64 కేబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవచ్చు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు రూ.499 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఏడాది వరకు ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు జియో యాప్ లన్నింటికీ సబ్ స్క్రిప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రూ.719 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 84 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. ఇక ప్రతిరోజు 2GB డేటా చొప్పున 168 GB డేటాను పొందవచ్చు. ఇక అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు జియో యాప్ లన్ని మీరు ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

Advertisement