Jio Plans : రూ.15 నుంచే జియో ప్లాన్స్..??

Jio Plans : దేశంలోని టెలికాం దిగ్గజ సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో సామాన్యులను కూడా దృష్టిలో పెట్టుకొని రకరకాల రీఛార్జ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే రీఛార్జి ప్లాన్లను అందిస్తూ డేటాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ఉన్నట్టుండి డేటా అయిపోయి 4G డేటా ఉన్నఫలంగా పొందాలంటే అది కుదరదు . రోజువారి లిమిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం డేటా వినియోగించుకునే అవకాశం ఉంటుంది . కానీ ఉన్న రోజే తక్కువ ధరలో కేవలం 4జి డేటా మాత్రమే పొందాలి అనుకునే వారికి కూడా జియో సరికొత్త అవకాశాన్ని అందించింది.

Advertisement

రిలయన్స్ జియో ప్రత్యేకంగా అందిస్తున్న డేటా ప్లాన్స్ కేవలం 15 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయి. ఒకవేళ మీరు జియో లో ప్రతిరోజు 1GB, 1.5 GB, 2GB డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసినా కూడా మీకు డేటా సరిపోనట్లైతే జియో నుంచి డేటా ప్లాన్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా డైలీ లిమిట్ పూర్తయితే ఆరోజు అదనంగా 4జి డేటా వాడాలనుకునే వారికి ఈ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇకపోతే జియో యూజర్లకి ఫోర్ జి డేటా ఓచర్స్, ఫోర్ జి డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈ ప్లాన్స్ 15 రూపాయలు నుంచి ప్రారంభం అవుతుంది.. కాబట్టి రీఛార్జ్ చేసే వారికి అదనంగా డేటా లభిస్తుంది.

Advertisement
Jio plans starting from Rs.15 only
Jio plans starting from Rs.15 only

రూ.15 రీఛార్జ్ ప్లాన్ : 15 రూపాయల విలువైన ఫోర్ జి డేట్ అప్ వోచర్ రీఛార్జ్ చేస్తే మీరు వన్ జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

రూ.25 రీచార్జ్ ప్లాన్ : 25 రూపాయల విలువైన రీఛార్జి ప్లాన్ చేసుకుంటే మీరు అదనంగా 2GB డేటా అధికంగా పొందవచ్చు.

రూ.61 రీఛార్జ్ ప్లాన్ : 61 రూపాయలు విలువైన ఫోర్ జి డేటా ఓచర్ రీఛార్జ్ చేస్తే మీరు 6GB డేటాను అదనంగా పొందవచ్చు.

రూ.121 రీఛార్జి ప్లాన్ : 101 రూపాయిల విలువైన ఫోర్ జి డేటా ఓచర్ రీఛార్జ్ చేస్తే మీరు 12gb డేటాను పొందవచ్చు.

ఇకపోతే ఈ నాలుగు ప్లాన్స్ కూడా యాక్టివ్ ప్లాన్ ఉన్న వారి కోసమే.. మరి వారు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకునే వాళ్ళు యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియో రూ.181 డేటా ఆడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 జీబీ డేటాను పొందవచ్చు. ఇక ఇది మీరు 30 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. రూ.241 రీఛార్జి ప్లాన్ అయితే 40 జిబి డేటా తో పాటు 30 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది.

Advertisement