Jio : అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ అయినా రిలయన్స్ జియో తాజాగా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక జియో మీడియం టర్మ్ కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా వినియోగదారులకు అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా జియో అందిస్తున్న ఆఫర్ల ద్వారా జియో యాప్లన్నింటికీ ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందడమే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ లను కూడా ఉచితంగా పొందవచ్చు. ఇక వీటి ద్వారా మంచి వినోదపరితమైన ఎన్నో సినిమాలను వీక్షించే అవకాశం ఉంటుంది.
మీరు ఒక రీఛార్జ్ తో కాల్స్ బెనిఫిట్స్ మాత్రమే కాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ లను కూడా ఉచితంగా పొందవచ్చు..ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒక రీఛార్జ్తో రెండు బెనిఫిట్స్ లభిస్తాయి. మరి ఉచిత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో అందిస్తున్న రూ.583 రీఛార్జ్ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఈ ప్లాన్ మీకు 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది . ఇక ఇతర నెట్వర్క్ కూడా ఉచితంగా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు.
ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది.. ఇక డేటా విషయానికి వస్తే.. ప్రతిరోజు 1.5 GB డేటా చొప్పున 84 జీబీ డేటాను పొందవచ్చు. అంతేకాదు మీరు ఎటువంటి అదనపు ఖర్చు చేయకుండా 90 రోజులకు రూ.149 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ని కూడా ఉచితంగా పొందవచ్చు. ఇక అంతేకాదు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తో సహా జియో కి సంబంధించిన అన్ని యాప్లను మీరు ఉచితంగా యాక్సిస్ చేసుకోవచ్చు. డేటా అవసరం ఉండి జియో రోజు వారి డేటా వినియోగం పూర్తయితే 15 రూపాయలతో 4G డేటా వోచర్ రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.15 డేటా ఓచర్ తో మీకు 1 జీబీ హై స్పీడ్ 4G డేటా లభిస్తుంది.