Jio Network : 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశంలో టెలికాం దిగ్గజ సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో మూడు సరికొత్త ఆఫర్లను లాంచ్ చేసింది. ఇక అన్ని ఆఫర్లు కూడా జియో అధికారిక వెబ్సైట్ నుంచి అందుబాటులో ఉండకపోవచ్చు అని కూడా స్పష్టం చేసింది .కానీ ఈ ఆఫర్లను కష్టమర్లకు అధిక ప్రయోజనాలతో అందించేలా తీసుకురావడం జరిగింది వాస్తవానికి ముందుగా 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం ఒక ప్లాను మాత్రమే ఇప్పుడు తాజాగా ఈ ఆఫర్లో మరొక 2 ప్లాన్లను జత చేయడం జరిగింది. ఇకపోతే మీరు జియో అధికారిక వెబ్సైట్ నుండి అన్ని ఆఫర్లు అందుబాటులో లేకపోయినా ఈ ప్లాన్లను మీరు మై జియో యాప్ ద్వారా పొందవచ్చు. మరి రిలయన్స్ జియో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందించిన ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. జియో సరికొత్త ఆఫర్ రూ.2,999 – జియో ఇండిపెండెన్స్ డే 2022 ఆఫర్ జియో యొక్క రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో అందుబాటులోకి వచ్చింది. ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రెగ్యులర్ ప్లాన్ లాగే అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో పాటు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ మనకు ప్రతిరోజు 2.5జిబి హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇక అంతే కాదు డైలీ లిమిట్ ముగిసిన తర్వాత 64 కేబిపిఎస్ డేటాకు తగ్గించబడుతుంది. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా మీరు 75 జిబి అదనపు హై స్పీడ్ ఫోర్ జి డేటా, Ajio పై రూ.750 , Nermeds పై రూ.750, Ixigo పై రూ.750 తగ్గింపు తో సహా రూ.2,250 విలువైన ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
జియో రూ.750 ప్లాన్: రూ.749 ప్లాన్ రూ.1 ప్లాన్ .. రెండు కలయికగా ఈ ప్లాన్ వస్తుంది.. రూ.749 తో 90 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ , ప్రతిరోజు 2GB డేటా పొందవచ్చు. అలాగే అదనంగా. రూ.1 ప్లాన్ తో డైలీ హండ్రెడ్ ఎంబి డేట్ పొందవచ్చు.అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా మీరు 75 జిబి అదనపు హై స్పీడ్ ఫోర్ జి డేటా, Ajio పై రూ.750 , Nermeds పై రూ.750, Ixigo పై రూ.750 తగ్గింపు తో సహా రూ.2,250 విలువైన ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.