ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే త్వరలోనే 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. రిలయన్స్ జియో 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో మిగిలిన సర్వీస్ ప్రొవైడర్లు కొంచెం వెనుకడుగు వేస్తున్నాయని చెప్పవచ్చు. ఇక వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ వంటి టెలికాం దిగ్గజాల కంటే ముందే రిలయన్స్ జియో దేశంలో 5G నెట్వర్క్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇక మొదటిసారి మొదటి దశలో ఎంపిక చేసిన 4 నగరాలలో ఈ సేవలను ప్రవేశపెట్టనుంది రిలయన్స్ జియో.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటుంది. ఇక 5G సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్ ను కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల కిందటే వేలం వేసిన విషయం తెలిసిందే . ఇక 5G నెట్వర్క్ 4Gతో పోల్చుకుంటే పది రెట్లు వేగాన్ని కలిగి ఉంటుంది 20 సంవత్సరాల పాటు కాలపరిమితితో ఈ వేలం పాటలను టెలికాం శాఖ నిర్వహించడం జరిగింది. ఇకపోతే 72097.85 MHZ సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ 5 G ని వేలానికి ఉంచింది. అయితే మొత్తం మూడు ఫ్రీక్వెన్సీ లలో ఈ వేలంపాటకు 5G నెట్వర్క్ వచ్చింది.
ఇకపోతే తాజాగా ముకేశ్ అంబానీ దీపావళికి అద్భుతమైన కానుకలు ప్రకటించారు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ముఖేష్ అంబానీ తో పాటు రిలయన్స్ జియో కొత్త చైర్మన్ ఆకాష్ అంబానీ కూడా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. నిన్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వీరు వెల్లడించారు. ఇక వారు చేసిన ప్రకటన మేరకు ముంబై, చెన్నై, ఢిల్లీ , కోల్కతా వంటి మెట్రో సిటీలో తొలి విడతగా ఈ సర్వీసులను ప్రవేశపెడతామని , డిసెంబర్ నాటికి అన్ని సిటీల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ ను విస్తరింప చేయడానికి తాము 2 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టబోతున్నాము అని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇకపోతే దీపావళి పండుగకు వచ్చే కానుకను ఇప్పుడే ప్రకటించి తమ యూజర్లకు ఆనందాన్ని కలిగించారు.