Jio : దేశంలోనే ప్రైవేటు టెలికాం దిగ్గజం అయిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని అధునాతన సేవలు.. పరికరాలను వినియోగదారులకు చేరువ చేయడంలో మరొక ముందడుగు వేసింది. ఇప్పుడు మరొక సరికొత్త ఆవిష్కరణతో తమ వినియోగదారుల కోసం ముందుకు వచ్చింది రిలయన్స్ జియో.. అయితే ఈ విషయాన్ని రిలయన్స్ జియో కొత్త చైర్మన్ ఆకాష్ అంబానీ ప్రకటించారు . ఇకపోతే జియో ఎయిర్ ఫైబర్ అనేది ఒక ప్లగ్ అండ్ ప్లే పరికరం.. కానీ ఇకపై ఎలాంటి వైర్లు లేకుండానే దీని ద్వారా కస్టమర్లు ఫైబర్ నెట్వర్క్ స్పీడుతో సమాన స్థాయి అనుభూతిని పొందవచ్చు అని ఆకాష్ తాజాగా మీడియాతో వివరించారు.
అల్ట్రా హై స్పీడ్ జియో ట్రూ 5 G ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉండే ఈ పరికరం ఆఫీస్ ఇల్లు ఇలా పర్సనల్ హాట్ స్పాట్ గా కూడా పనిచేస్తుంది అని ఆయన వెల్లడించారు. ఇకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ అన్యూవల్ జనరల్ మీటింగ్ సందర్భంగా ఆకాష్ అంబానీ ఈ విషయాన్ని తెలియజేయడం గమనార్హం. ఇకపోతే నెట్వర్కులో జియో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లపై వన్ జీబీపీఎస్ స్పీడు కూడా పొందడం లేదు అని ఆకాష్ అంబానీ ప్రస్తావించారు . ఇకపోతే జియో ఎయిర్ ఫైబర్ స్పీడ్ గిగా బైట్ గా ఉంటుందని ఆయన వివరించారు. ఇక ఈ పరికరం ఉపయోగించి మల్టిపుల్ వీడియో స్ట్రీమ్స్ తో పాటు ఇతర సర్వీసులు కూడా లభిస్తాయి అని ఆయన తెలిపారు.
ఇకపోతే ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలోని ముఖ్య నగరాలలో జియో 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి 5జి నెట్వర్క్ ను విస్తరిస్తాము అని ఆకాష్ అంబానీ వెల్లడించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా 5జి నెట్వర్క్ విస్తరణకు గాను సుమారుగా రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ కనెక్టివిటీ నెట్వర్క్ రూపకల్పనకు రిలయన్స్ జియో మరో ముందడుగు వేస్తోందని అదే జియో 5జి అని ఆకాష్ అంబానీ తెలిపారు. ఇకపోతే స్మార్ట్ హోం సొల్యూషన్స్ తో దేశంలోని 10 కోట్ల ఇళ్లకు 5G నెట్వర్క్ ద్వారా అనుసంధానం అవుతున్నాము అని ఆయన సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.