Jio : ఇటీవల కాలంలో జియో తన కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అధునాతన బెనిఫిట్స్ కలిగిన రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇకపోతే క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో లైవ్ క్రికెట్ చూడాలి అంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఐనా ఉండాలి లేదా ఏదైనా టీవీ ఛానల్ కు సబ్స్క్రిప్షన్ చేసుకోనైనా ఉండాలి. వీటిని కొనుగోలు చేయాలంటే మళ్లీ మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక మీరు క్రికెట్ చూడాలి అని , అది కూడా తక్కువ ధరకే చూడాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి వారి కోసం జియో ఒక శుభవార్తను తీసుకువచ్చింది.
జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ తో మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఉచిత ఎస్ఎంఎస్లు అలాగే డేటాని కూడా పొందవచ్చు .అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో క్రికెట్ కూడా వీక్షించవచ్చు. ఇకపోతే జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ యొక్క పూర్తి వివరాల విషయానికి వస్తే.. రూ.499 జియో రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ మీకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే ప్రతిరోజు 2GB డేటా చొప్పున 56GB డేటా పొందవచ్చు. అంతేకాదు ఏ ఇతర నెట్వర్క్ కైనా సరే జియో నుంచి అపరిమిత వాయిస్ కాల్స్ ను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు.
ఇక సబ్స్క్రిప్షన్ యాప్స్ విషయానికి వస్తే. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ , జియో క్లౌడ్ తో పాటు మరెన్నో జియో యాప్ లకు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు 28 రోజులపాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక 28 రోజులపాటు మొబైల్ ఎడిషన్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ద్వారా లైవ్ క్రికెట్ ను వీక్షించే అవకాశాన్ని జియో అందించింది. ముఖ్యంగా ఈ రీఛార్జ్ ప్లాన్స్ తో మీకు ఉచిత వాయిస్ కాల్స్ అలాగే ఇంటర్నెట్ డేటా తో పాటు ఉచితంగా లైవ్ క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్లాన్ తో మీరు మరింత వినోదాన్ని పొందవచ్చు.