Jio 5G : రిలయన్స్ జియో.. దేశంలోనే నెంబర్ వన్ టెలికాం దిగ్గజ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇకపోతే ఎప్పటికప్పుడు తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని సరికొత్త నెట్వర్క్ 5G ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే కనుక నిజమైంతే జియో లాభాల బాట పడుతుంది అని పలువురు టెక్ సంస్థలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి. ఇకపోతే 5G నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలంలో అత్యధిక బిడ్డర్ గా జియో నిలిచింది. ఏకంగా రూ.88,078 కోట్లను వెచ్చించి మరీ ఎయిర్ లైన్స్ సొంతం చేసుకుంది జియో. అంతేకాదు 700MHz ఎయిర్ వేవ్స్ ను దక్కించుకున్న ఏకైక టెలికాం సంస్థగా రిలయన్స్ జియో మొదటి స్థానంలో నిలిచింది.
ఇకపోతే అనుకున్న దానికంటే ముందే 5G నెట్వర్క్ ను జియో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 5G సేవలను అక్టోబర్ నెలలో మొదలుపెడతామని అంచనాలు వచ్చాయి. కానీ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఒక హింట్ ఇవ్వడంతో జియో 5G లాంచింగ్ ముందుగానే ఉంటుందా అనే ప్రశ్న మొదలైంది ఎందుకంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఆకాష్ అంబానీ తాజాగా దేశవ్యాప్తంగా 5 G రోల్ అవుట్ తో అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకను జరుపుకుందాం అని జియో కొత్త బాస్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
ప్రపంచ స్థాయి అఫార్డబుల్ 5G, 5G బేస్డ్ సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆయన మాటలను బట్టి చూస్తే కచ్చితంగా ఆగస్టు 15వ తేదీ నుంచి జియో 5G నెట్వర్కు ప్రారంభమవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలోని మరికొన్ని అనుమానాలు కూడా వస్తున్నట్లు సమాచారం .ఎందుకంటే ఆగస్టు 15వ లోపు జియో నెట్వర్క్ మొదలుపెట్టాలి అంటే జియో 5G సిమ్లను కూడా తీసుకురావాల్సిందే. ఇక అప్పటిలోగా సిమ్ లను అందుబాటులోకి తెస్తుందో లేదో అని అనుమానం కూడా వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు .అంతేకాదు ఇప్పటికే ట్రయల్స్ ను కూడా పూర్తి చేసింది కానీ ఈ టెస్టులపై జియో పెద్దగా సమాచారాన్ని అందించలేదు. కానీ ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా మాత్రం 5జి టెస్టింగ్ పై ప్రకటనలు చేయడం జరిగింది. ఇక ఏది ఏమైనా మిగిలిన టెలికాం సంస్థల కంటే జియో ముందుగానే ఫైవ్ జి సిమ్ లను తీసుకురాగలిగితే ఆ కంపెనీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని అందరూ ఊహాగానం వ్యక్తం చేస్తున్నారు.