Jio : రిలయన్స్ జియో కస్టమర్ల కోసం మరొక అడుగు ముందుకు వేసింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 28 రోజుల వ్యాలిడిటీతో రూ.91 రూపాయలకే అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్ ను కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇక గొప్ప ప్రయోజనాలు అందించే మరికొన్ని బెస్ట్ ప్లాన్స్ కూడా ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..
జియో రూ.91 రీచార్జ్ ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటీతో పూర్తిగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అలాగే ఈ వ్యాలిడిటీ కాలానికి గానూ రోజూ 100 MB అలాగే 200 MB అదనపు డేటా చొప్పున మొత్తం 3 జి బి డేటాను పొందుతారు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 50 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఈ ప్లాన్ తో అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సిస్ కూడా పొందవచ్చు. ఇక అలాగే జియో కస్టమర్లకు అధిక ప్రయోజనాలను అందించే మరిన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి.
జియో రూ.333 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : ఇక ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జిబి హై స్పీడ్ డేటా చొప్పున 42 GB డేటాను పొందుతారు. ఇక ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64 కేబిపిఎస్ వేగానికి తగ్గించబడుతుంది. అదనంగా ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.
జియో రూ.799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. 56 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2GB హై స్పీడ్ డేటాను పొందుతారు. వ్యాలిడిటీ కాలానికి గాను 112 GB డేటాను పొందుతారు. డైలీ లిమిట్ ముగిసిన తర్వాత వేగం 64 కేబిపిఎస్ కు తగ్గించబడుతుంది. అదనంగా ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను కూడా పొందవచ్చు. అలాగే పూర్తిగా ఒక సంవత్సరం పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు.
జియో రూ.2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ మీకు ఏడాది పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను అందిస్తుంది. ఇక ప్రతిరోజు 2.5 జిబి హై స్పీడ్ డేటాను పొందుతారు. సంవత్సరానికి గాను 912.5 GB డేటాను పొందుతారు. ఇక డైలీ లిమిట్ పూర్తయిన తర్వాత 64 కేబిపిఎస్ కి తగ్గించబడుతుంది. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందుతారు. అలాగే ఒక సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు.