Jio : దేశంలోని టెలికాం దిగజా అయినటువంటి రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అధునాతన రీఛార్జ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. కానీ ఈసారి మరొక ముందడుగు వేసి గేమింగ్ ప్రియుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక జియో గేమ్స్ వాచ్ పేరుతో కొత్త ప్లాట్ఫారం లాంచ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది జియో.. ముఖ్యంగా మొబైల్ గేమర్స్ కు ఈ స్ట్రీమింగ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అన్ని రకాల గేమింగ్ కంటెంట్ కు ఇది వన్ స్టాప్ షాప్ అవుతుందని రిలయన్స్ జియో దీమా వ్యక్తం చేసింది.
ముఖ్యంగా ఈ ప్లాట్ఫారం ద్వారా క్రియేటర్లు గేమ్ ప్లే లేదా ఇతర కంటెంట్ ను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. ఇక మినిమల్ లేటెన్సీ తో.. ఏ డివైస్ లోనైనా లైవ్ స్ట్రీమ్ చేయడానికి మిలియన్ల మంది వీక్షకులకు తమ ఫైనాన్స్ మెటీరియల్ ఎక్స్పోజ్ చేయడానికి ఈ ఫ్లాట్ ఫామ్ డెవలప్ చేయడం జరిగింది. ఇకపోతే జియో తోపాటు ఇతర డివైస్లలో కూడా బెస్ట్ ఇంటరాక్టివ్ గేమ్స్ స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ ను Jio Games watch అందిస్తుంది. జియో గేమ్స్ యాప్ లో జియో గేమ్స్ వాచ్ ప్లాట్ ఫామ్ యాక్సెస్ చేసుకుని వెసులుబాటును కూడా అందించడం జరిగింది. ఇకపోతే వినియోగదారులు తమ ఫేవరెట్ స్ట్రీమర్స్ సబ్స్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
ఇకపోతే క్రియేటర్లు తమ గేమ్ ప్లే లేదా ఇతర కంటెంట్ ను 1080 P, 720 రెజల్యూషన్ లో తక్కువ లేటేన్సితో స్ట్రీమ్ చేయవచ్చు. తాజాగా కొత్త గేమ్ ఎక్స్పీరియన్స్ కోసం జియో గేమ్స్ వాచ్ ను రిలయన్స్ జియో.. జియో గేమ్స్ లో జోడించడం జరిగింది. ఇకపోతే ఇందులో మీరు గేమ్స్ ఆడటానికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి అని గమనించాలి . అయితే జియో గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం రిలయన్స్ జియో కనెక్షన్ తప్పనిసరి అయితే కాదు. ఈ మధ్యకాలంలో గేమర్స్ కూడా కొత్తగా ఏదైనా గేమ్ కావాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో అలాంటి వారికి ఈ జియో గేమ్స్ వాచ్ అనేది చాలా అద్భుతంగా సహాయపడుతుందని చెప్పవచ్చు ఇందులో మీకు నచ్చిన గేమ్ ఆడే అవకాశం ఉంటుంది.