Jio Offers : ఫుట్ బాల్ ప్రియులకు శుభవార్త తెలిపిన జియో..!

Jio Offers  మొన్నటివరకు క్రికెట్ ప్రియులకు శుభవార్త తెలిపిన జియో .. ఇప్పుడు ఫుట్ బాల్ ప్రియులకు శుభవార్త తెలుపుతోంది. అసలు విషయంలోకెళితే..FIFA ప్రపంచ కప్ చూడాలనుకునే అభిమానులకు టెలికాం దిగ్గజం జియో శుభవార్తను అందించింది. ఖతార్లో ప్రారంభమయ్యే 2022 FIFA ఫుట్ బాల్ ప్రపంచకప్ ను చూడాలనుకునే అభిమానుల కోసం ఐదు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఖతార్ యూఏఈ కి వెళ్లే ఫుట్బాల్ అభిమానులకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయని జియో టెలికాం స్పష్టం చేసింది.

jio-good-news-for-football-lovers
jio-good-news-for-football-lovers

ప్రస్తుతం జియో టెలికాం కొన్ని కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సౌదీ అరేబియా మరియు ఖతార్లో జరిగే FIFA ఫుట్బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ల సంఖ్య ఆధారంగా తగిన ప్రణాళికలు కొనుగోలు చేయడానికి చందాదారులు అనుమతించబడతారు. ఇక అంతర్జాతీయంగా రోమింగ్ ప్లాన్లు jio.com లేదా మై జియో యాప్ లో అందుబాటులో ఉంటాయి . కాబట్టి కొత్తగా ప్రవేశపెట్టిన జియో రోమింగ్ ప్లాన్ ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

జియో టెలికాం యొక్క కొత్త రోమింగ్ డేటా ప్లాన్.. రూ.1,122.. ఇది ఐదు రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. అలాగే వన్ జీబీ డేటాను అందిస్తుంది. మీరు ఈ ప్లాన్ లోని మొత్తం డేటాను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక pay go ధరలు వర్తిస్తాయి.

మరొక రోమింగ్ డేటా ప్లాన్ విషయానికి వస్తే.. రూ.1,599.. ఈ ప్లాన్ వాలిడిటీ 15 రోజులు.. ఇది లోకల్ కాల్ మాత్రమే. ఇండియాకు తిరిగి కాల్ చేయడం మరియు ఇన్కమింగ్ కాల్ తో సహా 150 నిమిషాల వాయిస్ కాల్స్ ను కూడా అందిస్తుంది. అలాగే 1 GB డేటా, 100 ఎస్ఎంఎస్ లను కూడా అందిస్తుంది. అలాగే ఇందులో వైఫై ద్వారా ఇన్కమింగ్ కాల్ కు నిర్ణీత పరిమితి గడువు ముగిసిన తర్వాత ఒక రూపాయి ఛార్జ్ విధించబడుతుంది. వీటితోపాటు మరికొన్ని ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.