Jio : దిగ్గజ టెలికాం సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో తాజాగా డేటా ప్రియుల కోసం సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ ప్లాన్ ల ద్వారా డైలీ 2 జిబి డేటా లభించడంతోపాటు ఏడాది పొడవున ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్లాన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. రూ.2789 జియో ప్లాన్ : ఏడాదిపాటు మీరు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఇక ఏడాది కాలంలో మొత్తం 730 జిబి డేటాను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది . ఇక ఇవే కాకుండా ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ గా ఉచితంగా వాయిస్ కాల్స్ పొందవచ్చు. అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే సౌకర్యం ఉంటుంది. ఇకపోతే ఈ ప్లాన్ కు అదనంగా ఎలాంటి కంటెంట్ సర్వీసులను అందించడం లేదు. ఇక మిగతా టెలికాం సంస్థల ఆఫర్లతో పోలిస్తే జియో సరసమైన ధరల్లోనే మంచి ప్లాన్ ఆఫర్లను అందిస్తోందని చెప్పాలి.
నిజానికి ఇతర టెలికాం పోటీ దారులైన వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఈ ధరల్లో 1.5 జిబి డేటా మాత్రమే ఇస్తున్నాయి. కాబట్టి రీఛార్జి చేసే ముందు ఒకసారి పరిశీలించి మీకు నచ్చిన ప్లాను ఎంపిక చేయవచ్చు. రూ.2999 జియో ప్లాన్ : ఇక ఈ ప్లాన్ ద్వారా లాంగ్ టైం యూజర్లను దృష్టిలో పెట్టుకొని జియో 365 రోజులపాటు వ్యాలిడిటీని అందివ్వడానికి సిద్ధమయ్యింది. ఇక ప్రతిరోజు 2.5 జిబి డేటా తో పాటు ఇతర టెలికాం సంస్థలకు కూడా ఉచితంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక ఏడాది మొత్తంలో ఈ ప్లాన్ ద్వారా మీరు 912.5 జిబి డేటాను వినియోగించుకుంటారు.
ఇక అంతేకాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. ఇక జియో యూసర్లు జియో సెక్యూరిటీ, జియో సినిమా, జియో టీవీ , జియో క్లౌడ్ వంటి జియో యాప్ లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది. రూ.799 జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు ప్రతిరోజు 2GB డేటాను అందివ్వడంతో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను కూడా అందిస్తోంది. 56 రోజుల వాలిడిటీ ఉండే ప్లాన్ ద్వారా మీరు 112 GB హై స్పీడ్ 4G డేటాను పొందవచ్చు. ఇక జియో యాప్ లకు సంబంధించిన అన్ని ఆప్లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.