Jio Bumper Offer : సినీ ప్రియులకు జియో బంపర్ ఆఫర్.. ఏడాది పాటు ఉచితం..!!

Jio Bumper Offer : ఈ మధ్యకాలంలో భారతదేశం టెలికాం మార్కెట్ లో ప్రస్తుతం జియో కంపెనీ తమ యూజర్ల కోసం అదిరిపోయే బెస్ట్ ప్లాన్లను అందిస్తూ మరింత అగ్రస్థానానికి చేరుకుంది. ముఖ్యంగా పోటీదారులు ఎవరు కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించలేదు. ఇక ఈ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న బంపర్ ఆఫర్ సినీ ప్రియులకు కూడా బాగా పనిచేస్తుందని చెప్ప వచ్చు. ఇక ఏడాది పొడవంతా అందుబాటులో ఉండే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లతో ఉచిత ఓటిటి సబ్స్క్రిప్షన్ తో వినియోగదారులకు మరింత చేరువ అవ్వడానికి సిద్ధమయింది రిలయన్స్ జియో. మరి రిలయన్స్ జియో అందిస్తున్న ఆ ప్లాన్ ఏంటి ? ధర ఎంత ?

ఇలా అన్ని వివరాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం. రూ.4199 ప్రీపెయిడ్ రిలయన్స్ జియో ప్లాన్.. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్రీ పెయిడ్ ప్లాన్..ఇదే సంవత్సరం కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ ప్రవేశ పెట్టడం గమనార్హం. ఇకపోతే ఈ మధ్యకాలంలో టెలికాం ఇండస్ట్రీలో ఉన్న చాలా ప్రీపెయిడ్ ప్లాన్ లు ఉచిత డిస్నీ + హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ తో మాత్రమే వస్తున్నాయి. కానీ ప్రస్తుతం జియో అందిస్తున్న ఈ ప్లాన్ తో మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెంట్ తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా పొందవచ్చు.. ఇకపోతే కంటెంట్ యాడ్లు లేకుండా హై క్వాలిటీ తో టీవీలో మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొంది.

Jio bumper offer for movie lovers Free for a year
Jio bumper offer for movie lovers Free for a year

అద్భుతమైన సినిమాలను, సీరీస్ లను చూసే అవకాశం కల్పించబడింది జియో. ఇకపోతే ప్రత్యేకంగా మీరు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సంవత్సరానికి రూ.1,499 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కానీ జియో అందిస్తున్న రూ.4,199 ప్రీపెయిడ్ ప్లాన్ తో వినియోగదారులు ఏడాది పాటు ఉచితంగా అపరిమిత వాయిస్ కాలింగ్ , ప్రతిరోజు 3GB డేటా పొందవచ్చు. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు 3gb డేటా చొప్పున ఏడాది పాటు 1095 GB పొందే అవకాశం ఉంటుంది. ఇక డైలీ లిమిట్ దాటితే మీరు ప్రతిరోజు నెట్ స్పీడ్ 64 కేబిపిఎస్ తో డేటా వినియోగించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే సినీ ప్రియులకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.