జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇచ్చే రీఛార్జ్ ఆఫర్లను తీసుకొస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా రిలయన్స్ జియో ప్రస్తుతం ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో తమ కష్టమర్ల కోసం వినూత్నమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది . ఇకపోతే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఈ ఆఫర్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆఫర్ ఈ మధ్య కాలంలో 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్లతో ఎవరైతే రీచార్జ్ చేసుకుంటారో ఆ కష్టమర్లు బహుమతులు గెలుచుకోవడానికి అర్హులు అవుతారు. అయితే తమిళనాడు సర్కిల్లో ఉన్న వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు అని జియో స్పష్టం చేసింది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అర్హత ఉన్న అన్ని టెలికాం సర్కిల్స్ లో కూడా జియో వినియోగదారులు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇకపోతే జియో ఈ ఆఫర్ కి సంబంధించి ఇతర నిబంధనలు , బహుమతులకు యూజర్లను ఎలా ఎంపిక చేస్తారో? షరతులు ఏమిటి ? అనే విషయాలను ట్విట్టర్ ద్వారా వివరించలేదు. ముఖ్యంగా టెలికాం 4G నెట్వర్క్ సేవలను సెప్టెంబర్ 5 2016న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇదే నెలకు జియో వ్యాపారంలో అడుగుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంగా ఈ ఆఫర్లను తీసుకువచ్చింది జియో.
రూ.2999 ప్లాన్ పై కూడా మీరు అదనంగా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్లాన్ పై మీరు ఒక్క రీఛార్జితో ఆరు ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు లక్ష రూపాయల వరకు ఇతర బహుమతులను పొందే అవకాశం ఉంటుంది. మీరు రూ.299తో మొదలయ్యే రీఛార్జ్ ప్లాన్స్ ను అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నా సరే బహుమతులు పొందవచ్చు. ఇక జియో అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్ ను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కూడా జియో కోరుతోంది. ఇక సెప్టెంబర్ 11వ తేదీ తర్వాత విజేతలను ప్రకటించి వారికి బహుమతులు తెలియజేస్తారట. ఇకపోతే కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మీరు కూడా త్వరపడి లక్ష రూపాయల విలువ చేసే బహుమతులను సొంతం చేసుకోవచ్చు.