Jio Recharge : ప్రస్తుతం దేశ టెలికాం రంగంలో చరిత్ర సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ లో లాంచ్ అయిన జియో 4G నెట్వర్క్ మొదటిసారి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు డేటాను పరిచయం చేయడం గమనార్హం. ఇక అక్కడి నుంచే అన్ని దిగ్గజ టెలికాం సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. ఇకపోతే ఇంతకుముందు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ ఎలాంటి రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడితే వాటిని కష్టమర్లు అనుసరించేవారు.. కానీ జియో వచ్చిన తర్వాత కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి వస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే జియో ఆరవ వార్షికోత్సవ సందర్భంగా యూజర్లకు ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇక ఇందులో భాగంగా యూజర్లు ఒక్క రీఛార్జ్ పై 6 కూపన్లను ఉచితంగా పొందవచ్చు.
అంతేకాదు ఇందులో 75GB డేటా కలిగిన ఉచిత ఆఫర్ కూడా ఉంటుంది ఇక జియో ఆరో వార్షికోత్సవ ఆఫర్ ఏ ప్లాన్ పై ఉంది.. ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.. అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం. జియో యానివర్సరీ ఆఫర్ కింద రూ.2,999 ప్లాన్ తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 75 జిబి డేటా కూపన్ ఉచితంగా పొందవచ్చు. అలాగే ట్రావెల్ పోర్టల్ Ixigo కి చెందిన రూ.750 విలువైన ట్రావెల్ కూపన్ కూడా దక్కుతుంది . అలాగే Netmeds లో 1000 రూపాయలు కొనుగోలు పై 25% డిస్కౌంట్ లభించే విధంగా ఒక కూపన్ లభిస్తుంది. అలాగే జియోకి చెందిన షాపింగ్ సైట్ అజియోలో కొనుగోలు చేయడానికి వీలుగా రూ.750 విలువైన కూపన్ కూడా లభిస్తుంది.
ఇక వీటితోపాటు రిలయన్స్ డిజిటల్ లో రూ.5000 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు పొందే విధంగా మరొక కూపన్, జియో సావన్ ప్రో ఆరు నెలల పాటు సబ్స్క్రిప్షన్ పై 50% తగ్గింపు కూడా పొందే విధంగా ఇంకొక కూపన్ లభిస్తుంది. ఇక ఇలా మొత్తంగా ఒక రీఛార్జ్తో ఆరు కూపన్ లు మీరు ఉచితంగా పొందవచ్చు.
అంతేకాదు 365 రోజులు వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజు 2.5 జిబి డేటా అలాగే 100 ఎస్ఎంఎస్లు ప్రతిరోజు లభిస్తాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ సంవత్సరం పాటు పొందవచ్చు. ఇక జియో యాప్ లన్నింటికీ కూడా ఉచితంగా యాక్సిస్ చేసుకోవచ్చు.