Jio 5G Phone : జియో నుంచీ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..!

Jio 5G Phone : దేశంలోనే టెలికాం దిగ్గజ సంస్థలలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న రిలయన్స్ జియో తన సంస్థ నుంచి కేవలం టెలికాం సర్వీస్లను మాత్రమే కాదు టెక్ సర్వీసులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే జియో తాజాగా తమ సంస్థకు సంబంధించిన కొన్ని మొబైల్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్న జియో తాజాగా 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా గత ఏడాది జియో ఫోన్ నెక్స్ట్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చిన జియో.. కేవలం రూ. 5000 కే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంచలమైన విషయమని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా దానికి కొనసాగింపుగా 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ను దసరా లేదా ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి రానన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తాజాగా టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లో జియో 5G స్మార్ట్ ఫోన్ పై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఈ ఫోన్ కి సంబంధించి ఎలాంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.. ధర ఎంత ఉంటుంది.. అనే విషయంపై జోరుగా ఊహాగానాలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం జియో 5G ఫోన్ 6.5 అంగుళాల హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉండనుందని సమాచారం. అంతేకాదు గూగుల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓ ఎస్ తోనే ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.

Jio 5G Smartphone from Features
Jio 5G Smartphone from Features

స్నాప్ డ్రాగన్ 480 5G ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగిస్తున్నారని, ఇక స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడమ్ ఉందనుందని సమాచారం. అంతేకాదు ఈ 5G ఫోన్ ఐదు రకాల 5G బ్యాండ్స్ ను సపోర్ట్ చేస్తుందట. ఇక కెమెరా విషయానికి వస్తే.. 13 ఎంపీ , ప్రైమరీ కెమెరా 2 ఎంపీ కెమెరా ఉండనున్నాయి. ముందు భాగంలో సెల్ఫీ కోసం 8 ఎంపీ కెమెరా ఉంటున్నట్లు సమాచారం. ఇక అంతే కాదు 18 W చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది . ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్, 32 GB స్టోరేజ్ వేరియంట్ తో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ రూ.12,000 లోపు లభిస్తుందని సమాచారం. దీనిపై ఈ ఎమ్ ఐ ఆఫర్ కూడా ఉండబోతుందట