Jio 4g SmartPhone : చౌక ధరకే జియో 4G స్మార్ట్ మొబైల్.. ఫీచర్స్ అదుర్స్..!!

Jio 4g SmartPhone : దిగ్గజ టెలికం ఆపరేటింగ్ సంస్థలలో ఒకటి అయినటువంటి రిలయన్స్ జియో తాజాగా తీసుకువచ్చిన జియో మొబైల్ నెక్స్ట్ ప్రస్తుతం భారీ తగ్గింపు ధరతో అందరికీ కూడా అందుబాటులో ఉండనుంది. గత ఏడాది ఈ మొబైల్ ను విడుదల చేశారు. అప్పుడు దీని ధర రూ. 6,499 లకు అందుబాటులో ఉన్నది. అయితే అప్పట్లో ఎక్స్చేంజి ఆఫర్ ను కూడా జియో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సాధారణంగానే పాత మొబైల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ధరలకే ఈ మొబైల్ ని కొనే అవకాశాన్ని తమ యూజర్లకు అందిస్తోంది. అంటే దాదాపుగా 2000 రూపాయల వరకు డిస్కౌంట్ తో ఈ మొబైల్ ని తమ కస్టమర్లకు రూ.5000 లోపు ధరకే అందిస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జియో మొబైల్ నెక్స్ట్ స్మార్ట్ మొబైల్ ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్లో రూ.4,599 రూపాయలకి అందుబాటులో ఉన్నది.

అయితే దీని అసలు ధర రూ.6,499 కాగా ఎక్స్చేంజ్ ద్వారా ఈ మొబైల్ ని మనం రూ.4,499 రూపాయలకే కొనుగోలు చేసేలా ఒక ఆఫర్ ను కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా అమెజాన్ లో మాత్రం ఇటువంటి ఎక్స్చేంజి ఆఫర్ లేకుండానే ఈ మొబైల్ ని రూ.4,599 రూపాయలకి కొనుగోలు చేసుకునే విధంగా సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ మొబైల్ 2 GB RAM,32 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ కి అదనంగా మనం స్టోరేజ్ చేసుకొనే సదుపాయం కూడా కలదు. ఇక ఈ తాజా ధర తో రూ.5 వేల లోపు వుండగా.. ఈ జియో నెక్స్ట్ మొబైల్ లభిస్తుంది. దీంతో సామాన్యులు సైతం ఈ మొబైల్ ని అతి తక్కువ ధరకే తీసుకోవచ్చు.. ఈ రేంజ్ లో ఈ మొబైల్ మించిన స్మార్ట్ ఫోన్ ఏదీ లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. 5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ను ఈ జియో నెక్స్ట్ మొబైల్ కలిగి ఉన్నది. దీనికి గొరిల్లా గ్లాస్ త్రీ ప్రొటెక్షన్ కూడా కలదు.

Jio 4g SmartPhone Features Adurs 
Jio 4g SmartPhone Features Adurs

స్నాప్ డ్రాగన్ -215 కోర్ ప్రాసెస్ తో ఈ మొబైల్ వర్క్ అవుతుంది. ఈ మొబైల్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆండ్రాయిడ్ ఆధారంగా మొబైల్ ఓఎస్ తో పని చేస్తుంది . ఇక ఇందులో డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్టు కూడా చేస్తుంది. మొదట ఈ సిమ్ స్లాట్ లో జియో సిమ్ మాత్రమే పనిచేస్తుంది. డేటా కేవలం జియో సిమ్ ద్వారానే వాడే సదుపాయం కూడా కలదు. ఇక ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే..3500 MAh సామర్థ్యం కలదు. మీ మొబైల్ 4g, వైఫై, మైక్రో యూఎస్బీ పోర్ట్, బ్లూటూత్ తదితర కనెక్టివిటీ ఫ్యూచర్లు కూడా ఇందులో అమర్చడం జరిగింది. ఇక కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ కెమెరా 13 మెగా పిక్సెల్ కలదు. సెల్ఫీ కోసం, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ తో తయారు చేయడం జరిగింది. అయితే ఈ మొబైల్ ను సామాన్యులను సైతం దృష్టిలో పెట్టుకొని జియో సంస్థ తయారు చేయడం జరిగింది. ఎవరైనా సరే అతి తక్కువ ధరలకే ఇన్ని ఫ్యూచర్ లు గల మొబైల్ తీసుకోవాలనుకునేవారు అమెజాన్ లో తీసుకోవచ్చు లేదంటే.. మై జియో యాప్ ద్వారా అయినా తీసుకోవచ్చు.