Reliance Jio : దేశంలోనే నెంబర్ వన్ టెలికాం దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించడానికి అలాగే వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అధునాతన రీఛార్జి ప్లాన్స్ లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం కొత్త తరహాగా ఒక ప్రత్యేకమైన ప్లాను తీసుకురావడం జరిగింది. జియో కొన్నిసార్లు విభిన్నమైన ప్లాన్లను తీసుకువస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా సరికొత్త టూ ఇన్ వన్ ప్లాన్ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం చాలా వెరైటీగా ఉందని చెప్పవచ్చు. ఒక రీఛార్జ్ చేసుకుంటే రెండు ప్లాన్సు మీకు అందుబాటులోకి వస్తాయి. రూ.750 ధరతో ఈ కొత్త విధమైన ప్లాన్ ను యూజర్లకు జియో అందుబాటులోకి తీసుకువచ్చింది . మరి ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి ..ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
రూ.750 జియో రీఛార్జ్ ప్లాన్ : ఇక ఈ ధరకు మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఇక అలాగే డేటా విషయానికి వస్తే.. ప్రతిరోజు 2GB డేటా చొప్పున 180 GB డేటా పొందే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా మరో 100MB డేటా పొందవచ్చు. అది ఎలాగా అంటే రూ.750 ప్లాన్ ను రెండు బెనిఫిట్స్ కలిగిన ప్లాన్సుగా జియో విడగొట్టింది. రూ.749 ప్లాంటో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్ 100 ఎస్ఎంఎస్ లు ఇస్తున్నట్టుగానే.. రూ.1 ప్లాన్ తో 100 ఎంబి ప్రతిరోజు డేటా అదనంగా పొందవచ్చు.
మొత్తంగా అయితే ఈ ప్రయోజనాలు రెండూ దక్కాలంటే రూ.750 రీఛార్జి ప్లాన్ చేసుకోవాలి ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ ప్లాన్ గా ఉండడం గమనార్హం. ఈ ప్లాన్ తీసుకుంటే మీరు జియో టీవీ , జియో సినిమా, జియో సెక్యూరిటీ , జియో క్లౌడ్ యాప్స్ లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 2GB డేటా తో పాటు అదనంగా 100 ఎంబి డేటా పొందవచ్చు. డేటా లిమిట్ అయిపోతే.. 64 కేబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొకవైపు ఈ నెలలోనే 5G సర్వీస్ లను కూడా లాంచ్ చేయడానికి జియో సిద్దమయింది. ఆగస్టు 15వ తేదీన 5G నెట్వర్క్ ప్రారంభం ఉంటుందని , జియో కొత్త చైర్మన్ ఆకాష్ అంబానీ ఇటీవల సంకేతాలు ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు నెరవేరుస్తారో తెలియాల్సి ఉంది.