తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఒక పని తెలుసుకొని జీవిత రాజశేఖర్ బాగా ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు గుండెలపై కొట్టుకుంటూ ఆమె ఏడ్చేసారట. నిజానికి జీవిత రాజశేఖర్ గతంలో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి నిరాధారమైన ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బయట అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. దీంతో చిరంజీవి బంధువైన అల్లు అరవింద్ వారిపై పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో వాదోపవాదనలు విన్న న్యాయస్థానం జీవితా రాజశేఖర్ లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దాంతో ఈ జంటకు షాక్ తగిలినట్లు అయ్యింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వారు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లినట్లు కూడా సమాచారం.
అయితే వారికి అక్కడ కూడా ఎదురు దెబ్బ ఎదురయ్యే అవకాశం ఉందని, కటకటాల పాలయ్యే సమయం దగ్గర పడిందని వార్తలు వస్తున్నాయి. సరిగా ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగి జీవిత రాజశేఖర్లకు అండగా నిలిచాడట. అంతేకాదు ఆయన వారి జైలులో పడకుండా బెయిల్ ఇప్పించడానికి కూడా రెడీ అయ్యాడట. సినిమా ఇండస్ట్రీ మొత్తం తమపై వ్యతిరేకత చూపుతున్న ఈ నేపథ్యంలో మహేష్ బాబు పెద్దమనస్సు చేసుకొని తమకు అండగా నిలబడ్డారని తెలిసి జీవితా రాజశేఖర్ ఎమోషనల్ అయిందట. అంతేకాదు ఆమె తమను కాపాడాలంటూ, తమ పరువును నిలబెట్టాలంటూ గుండెలు బాదుకుంటూ రోధించిందట.
దీనికి సంబంధించిన విషయాలు సన్నిహిత వర్గాల నుంచి సోషల్ మీడియా వేదికగా లీక్ అయ్యాయి. ఈ విషయాలను అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరికొందరు వాటిపై చర్చలు మొదలుపెట్టారు. పొరపాటున ఈ వ్యాఖ్యలు జీవిత చేసి ఉంటుందని, అవి పట్టించుకోకుండా వారిని వదిలేస్తే బాగుంటుందని మహేష్ అభిప్రాయపడుతున్నాడట. చిరంజీవి కూడా మహేష్ చెప్పినట్లే వారిని జైలుకు పంపించములే అనే మాట్లాడుతున్నారట. మరి అల్లు అరవింద్ ఈ కేసును వెనక్కి తీసుకుంటారా లేదంటే చేసిన ఆరోపణలకు వారిని శిక్షిస్తారా అనేది తెలియాల్సి ఉంది.