Pavan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చురకలు వేశారు.. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల సందర్భంగా.. పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలను ధరించడం పైన కూడా కామెంట్స్ చేశారు ఆర్జీవీ.. వారాహి వాహనంపై పవన్ ఫాన్స్ ను ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ వైరల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు.. ఇంతకీ రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
రామ్ గోపాల్ వర్మ వారాహి వాహనం డిజైన్ పై విమర్శలు చేశారు. వారాహి వాహనాన్ని హిట్లర్ వాహనంగా అభివర్ణించారు. మరో ట్వీట్ లో పంది వాహనం గా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాషాయ వస్త్రాలను ధరించడంపై స్వామి వివేకానందుడిగా పేర్కొన్నారు. హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు.. అంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు.
హిట్లర్, స్వామి వివేకానంద ఆయన కుడి, ఎడమ పాదాలను నొక్కుతారు.. పవర్ స్టార్ పవర్ అంటే అదేనంటూ చురకలు వేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించన మొదట్లో ఎన్టీఆర్ చైతన్య రథం మీద తిరిగితే, ఇప్పుడు పవన్ కల్యాణ్ పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటూ విమర్శించే వారిని జనసేనలతో బస్సు టైర్ల కింద తొక్కించేయాలని.. అలా చేయడం లీగల్ గా కుదరకపోతే.. కనీసం కేసులన్నా పెట్టించండి అంటూ ఆర్జీవి తన విన్నపం తెలియజేశారు. .
గుడిలో ఉంటే అది వారాహి అవుతుందని.. అదే రోడ్డు మీద ఉంటే అది పంది.. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని.. వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సు గా ముద్ర వేస్తారని పవన్ కల్యాణ్ కు ఆర్జీవి సెటైరికల్ గా తెలిపారు. జనసైనికులను ఉద్దేశించి.. డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆర్జీవి జనసేన అధినేత పవన్ వారాహి వాహనంపై చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శుభమా అని వారాహి వాహనం మొదలుపెట్టిన రోజే ఆర్జీవి ఇలా ఆ శుభంగా మాట్లాడితే ఎలా అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.