Rajamouli: 2000 కోట్లు ఇస్తా ఆ కథ నాకు ఇచ్చేయ్ .. రాజమౌళి కి జేమ్స్ కామెరాన్ ఆఫర్ – ఒకే ఒక్క మాట అన్న రాజమౌళి 

Rajamouli: తెలుగు సినిమా రేంజ్ ని గ్లోబల్ రేంజ్ కి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే లాగా చేశాడు. RRR సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఈ సినిమా ఎన్నో రికార్డులు కొట్టింది.. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్.. తాజాగా దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ టాప్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ను కలిశారు.

James Cameron offers 2000 crores for rajamouli that movie script
James Cameron offers 2000 crores for rajamouli that movie script

జేమ్స్ కెమెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైటానిక్ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. జేమ్స్ ఆ తర్వాత అవతార్ సినిమాతో వరల్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అందుకున్నాడు. ఆ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి అందర్నీ ఆశ్చర్యపోయేలాగా చేశారు. అవతార్ 2 సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. జేమ్స్ కామరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాని చూశారు. ఆయనకు ఈ సినిమా నచ్చడమే కాకుండా ఆ మూవీని చూడాలంటూ తన భార్య సుజికి సూచించారు.

 

జేమ్స్ తన భార్య తో కలిసి మరోసారి RRR సినిమాను చూశారు.. రాజమౌళి తో జేమ్స్ కామెరున్ పది నిమిషాల పాటు మాట్లాడారట.. ఆ పది నిమిషాల పాటు మాట్లాడిన మాటలు నాకు జీవితాంతం ఆనందాన్ని ఇస్తాయని.. మీ ఇద్దరికీ ధన్యవాదాలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అయితే జేమ్స్ కామెరూన్ రాజమౌళి మధ్య జరిగిన సంభాషణలలో ఓ ఇంట్రెస్టింగ్ టాపింగ్ గురించి కూడా చర్చించుకున్నారట. అదేంటంటే రాజమౌళి తీస్తున్న ఓ సినిమా గురించి చెప్పగా.. ఆ సినిమా ప్రాజెక్టు నాకు ఇచ్చేయ్ నీకు 2000 కోట్లు ఇస్తానని జేమ్స్ కామెరున్, రాజమౌళి ఆఫర్ ఇచ్చారట.

 

ఆ సినిమా కథ నాకు ఇచ్చేమని అడిగారట. అయితే రాజమౌళి సున్నితంగా స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదని.. ఇచ్చే ఉద్దేశం లేదు అంటూ సున్నితంగా తిరస్కరించారట. ఇంతకీ రాజమౌళి చెప్పిన ఆ సినిమా కథ ఎవరిదో కాదు.. తను త్వరలోనే తీయబోతున్న మహేష్ సినిమా కథ.. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కథనే ఓ రెండు లైన్లు జేమ్స్ కామెరూన్ తో రాజమౌళి చెప్పారట. అయితే రాజమౌళి చెప్పిన విధానం నచ్చడంతో వెంటనే ఆ సినిమా కథని ఇవ్వమని జేమ్స్ కామెరున్ అడిగారట 2000 కోట్ల రూపాయల ఆఫర్ కూడా ఇచ్చారట. మరి ఇక రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మహేష్ తో సినిమా పక్కన పెట్టేసి ఆ సినిమా కథని జేమ్స్ కెమెరూన్ ఇచ్చేస్తారా అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంది..