Kodali nani: కొడాలి నాని పై అరెస్ట్ వారెంట్..!

Kodali nani: మాజీ మంత్రి కొడాలి నాని పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ పేట సిఐ కి న్యాయమూర్తి గాయత్రీ దేవి ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. 2016 నాటి కేసులో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. 2016 మే 10వ తేదీన పోలీసు ఉత్తర్వులు లెక్కచేయకుండా కొడాలి నాని, కొలుసు పార్థసారథి భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Kodali Nani Flies To Hyd For Covid Treatment?

Advertisement

ఆ కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొడాలి నాని కి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే కొడాలి నాని తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఈ విషయంపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.గతంలో కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లుగా తెలుస్తున్నది.

Advertisement