Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరేలా అమలు చేస్తోంది.. జగన్ ప్రభుత్వం వరుసగా రెండోసారి మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసింది.. జగనన్న చేదోడు పథకం కింద కులవృత్తిలో ఉన్న బీసీలకు రూ. 10 వేల చొప్పున వారి ఖాతాలో జమ చేసింది..!!తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా 2.85 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 285 కోట్ల నగదు విడుదల చేశారు.
తాజాగా విడుదల చేస్తున్న రూ. 285 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగన్ అన్న తోడు పథకం కింద ప్రభుత్వం మొత్తంరూ. 583.78 కోట్ల సాయం అందించినట్లు జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు జగన్ వివరించారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

జగనన్న తోడు పథకం కింద షాపులు ఉన్న 1,46,103 మంది టైలర్ లకు రూ.146.10 కోట్లు, 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్లు, 40,808 నాయి బ్రాహ్మణులకు 40.801 కోట్లు సాయం అందించినట్లు సీఎం జగన్ వివరించారు. వరుసగా రెండోసారి జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేయడంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.