Jagan in Delhi satirical video : జగన్ మీద వెటకారపు వీడియో విడుదల చేసిన abn ఛానల్
మమ్మల్ని కాపాడయ్యా.. మాకు మోడీనే దేవుడయ్యా.. మోడీ జీ.. నమస్కార్ మమ్మల్ని ఇంకా మీరే కాపాడాలి సాబ్.. సిబిఐ చేయబట్టి మా మొహంలో చిక్కటి చిరునవ్వు లేకుండా పోయింది.. కంటి నిండా నిద్ర లేకుండా పోతోంది.. తిన్న తిండి ఒంటికి పట్టడం లేదు సార్.. అంటూ అందుకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఇమేజ్ను చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..
ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇప్పుడు జగన్ అర్ధాంతరంగా ఎందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకేంది ఎర్రకోట దగ్గర ఎర్రటి ఎండ కోటకి ఎర్రటి కోట ఎలిచిపోయిందట.. నువ్వు కూడా వెళ్తావా ఏంటి అని అనగానే.. ఏపీలో సిబిఐ ఉరుములు ఉరుమిస్తుంటే ఢిల్లీ వెళ్ళక ఏం చేస్తాడు మరి..
ఇంతకీ ఢిల్లీ వెళ్ళాక ఏం మాటలు మాట్లాడుతుంటాడు.. ఆ నేను వెళ్లి వాళ్ళ సోఫా కింద కూర్చుని విన్నా.. నా అంచనా ప్రకారం.. నన్ను నా తమ్ముడిని ఈ కేసులో నుంచి మీరే కాపాడాలి లేదంటే నేనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.. మా మీద దయ ఉంచి మమ్మల్ని కాస్త కాపాడండి సార్ మీకు రుణపడి అని అంటాడు. కరెక్ట్ గా ఇదే జరిగిందని నీకు ఎలా తెలుసు మామ అనగానే.. ఓపక్క బడ్జెట్ సమావేశాలు ఇలాంటి టైట్ సిట్యుయేషన్ లో కూడా జగన్ ఢిల్లీ వెళ్ళాడు అంటే.. ఈ విషయం కాక మరి ఇంకే విషయం అయి ఉంటుంది.
కవితక్కని అరెస్టు చేయాలంటే ముందుగా.. అవినాష్ ని లోపల వేయాల్సిందేగా.. లేదంటే బిజెపికి అపవాది వస్తుంది. కావాలనే కక్ష కట్టి కెసిఆర్ మీద ఇదంతా చేశారని అపవాదు క్రియేట్ చేస్తారు. అలా కాకూడదు అంటే కచ్చితంగా అవినాష్ ను లోపల వేయాల్సిందే . అది జరగకుండా ఉండాలని జగన్ ఈ అర్ధాంతర ఢిల్లీ టూర్ ఆంతర్యం అయి ఉంటుంది అంటూ.. ఓ ఫన్నీ సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.