Jabardast: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని మొదట్లో చిన్నపిల్లలతో కలిసి పని స్కిట్స్ చేసిన రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే గత కొద్దిరోజులుగా జోర్దార్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజాతతో ఆయన ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే జబర్దస్త్ స్కిట్లలో కూడా సుజాత సందడి చేసింది. అలాగే గత ఏడాది వరలక్ష్మి వ్రతాన్ని కూడా సుజాత పెళ్లి కాకముందే అత్తవారింట్లో ఘనంగా జరుపుకున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి డేట్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. దీనికోసం అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూశారు.. కానీ ఎవరు ఊహించని విధంగా ఎవరికీ చెప్పకుండా తిరుపతిలో ఈ రోజు ఉదయం రహస్యంగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే మొన్నటి వరకు ప్రేమించుకున్న ఈ జంట ఉన్నట్టుండి ఎవరికి చెప్పకుండానే పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీరి పెళ్లికి గెటప్ శ్రీను ఆయన భార్యతో పాటు మిగతా సెలబ్రిటీలు వచ్చి సందడి చేసినట్లు తెలుస్తోంది.