Chicken Biryani : రెస్టారెంట్ కి వెళ్ళగానే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టడం కాదు .. ముందు ఈ విషయం తెలుసుకోండి !

Chicken Biryani : న‌లుగురు మిత్రులు క‌లిశారంటే బ‌య‌టికి వెళ్ల‌డం బిర్యాని తిన‌డం స‌ర్వ సాధార‌ణం.. అలా చీటికి మాటికీ బ‌య‌ట బిర్యాని తినే బిర్యాని ప్రియుల‌కు చేదు వార్త‌… ఇంట్లో చేసుకునే బిర్యానీ ఫ‌ర్వాలేదు కానీ రెస్ట‌రెంట్లో చేసే బిర్యానీలో మాత్రం టేస్టింగ్ సాల్ట్, టార్‌ట్రాజిన్, మెటానియ‌ల్ ఎల్టోతో పాటు వివిధ ర‌కాల ర‌సాయ‌నాలు క‌లుపుతారు. ఇలా వ‌రుస‌గా 45 రోజులు తింటే జీర్ణసంబంధిత వ్యాధులు, ఎముక‌లు బ‌ల‌హీన ప‌డి కీళ్ల నొప్పులు కూడా వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. వీటితోపాటు రోడ్‌సైడ్ మ‌నం తినే జంక్‌ఫుడ్స్‌, పానీపూరీ లాంటి వంట‌కాల్లో కూడా అవి చాలా రోజులు నిల్వ‌లు ఉండ‌టానికి వాటిల్లో ర‌క ర‌కాల ర‌సాయనాలు, విష‌వాయువులు యాడ్ చేస్తారు.

Chicken Biryani : ఎక్కువ‌గా ఐస్‌క్రీమ్స్ తింటున్నారా?

ఇలాంటి క‌ల్తీ ప‌దార్థాలు తిని ప్ర‌తి రోజూ ఎంతో మంది రోగాల బారిన ప‌డుతున్నారు. మ‌నలో చాలా మంది ఐస్ క్రీం ప్రియులు ఉంటారు. వీరు నిత్యం ఐస్ క్రీం ఎక్కువ‌గా తింటారు. చివ‌ర‌కు ఎక్కువ మోతాదులో ఇంటికి తెచ్చుకుని ఫ్రీజ‌ర్‌లో పెట్టుకొని తింటున్నారు. వీటిలో త‌క్కువ‌ కొవ్వుశాతం ఉన్న పాల‌తో పాటు వాటిలో రంగులు, టార్‌ట్రాజిన్ లాంటి ర‌సాయ‌నాలు క‌లుతారు. ఐస్‌క్రీంలు త్వ‌ర‌గా గ‌డ్డ‌క‌ట్టేందుకు ప్రాణాంత‌క ర‌సాయ‌నాలు వాడుతారు. ఇవ‌న్నీ మ‌న‌కు తెలియ‌క చిన్న పిల్ల‌ల‌కు సైతం తినిపిస్తుంటాం. ఇలా చేస్తే ధీర్ఘ‌కాలిక వ్యాధులు తెచ్చిపెడ‌తాయి. స్వీట్ల‌పై ఉండే సిల్వ‌ర్ రేప‌ర్‌ బేక‌రీల‌లో త‌యారు చేసే స్వీట్లు తింటే క‌చ్చితంగా క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

It's not like ordering chicken biryani when you go to a restaurant
It’s not like ordering chicken biryani when you go to a restaurant

స్వీట్ల‌పై వాడే సిల్వ‌ర్ ర్యాప‌ర్‌లో సీసం శాతం ఎక్కువ‌గా ఉంటుంది. స్వీట్ల‌లో వాడే టార్పిజిన్‌, బ్ర‌లియంట్ ఎల్లో, కాట్రాజ్‌, స‌న్‌సెట‌న్ లాంటి ప‌దార్థాలు కూడా హానిక‌ర‌మే ఆహార భ‌ద్ర‌తా శాఖ ఏం చేస్తుంది ఫుడ్‌లో వాడే టేస్టింగ్ సాల్ట్‌, ర‌సాయ‌నాలు లాంటివి చైనా నుంచి ఫ‌ర్టిలైజ‌ర్ పేరుతో దిగుమ‌తి చేసుకుంటారు. అందుకే ప్ర‌భుత్వం నివారించ‌లేకపోతుంది. చైనాలో త‌యార‌యినా అక్క‌డ వాటిని వంట‌ల్లో వీటిని వాడితే నేరుగా చైనా ప్ర‌భుత్వం ఉరిశిక్ష‌లు అమ‌లు చేస్తుంది. ర‌సాయ‌నాలు వాడిన ప‌దార్థాల‌ను నెల‌లో నాలుగైదు సార్లు తీసుకుంటే షుగ‌ర్‌, బీపీతో పాటు కొన్ని ధీర్ఘ‌కాలిక వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. టేస్టింగ్ సాల్ట్‌ ఎక్కువ‌గా తీసుకుంటే నాలుక రుచులను గ్ర‌హించే శ‌క్తిని శాశ్వ‌తంగా కోల్పోతుంది. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు బ‌య‌టి పదార్థాలు తీసుకోకుండా ఇంట్లోనే త‌యారుచేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచితోటు సుచిగా ఉంటుంది.

Advertisement