భారతదేశంలో చాలా మంది ప్రజలకు భోజనం చివరిలో పెరుగు అన్నం తినకపోతే అసంతృప్తిగా అనిపిస్తుంది. ఎంత రుచికరమైన భోజనం చేసినా చివరికి పెరుగు ఉంటేనే వారికి అది సంపూర్ణ భోజనం అవుతుంది. కానీ పెరుగు అన్నివేళలా తినడం అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా వర్షాకాలంలో పెరుగు తినకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో వర్షాకాలం మొదలైంది కాబట్టి పెరుగు ఈ కాలంలో ఎందుకు తినకూడదో తెలుసుకోవాల్సిన అవసరముంది.
ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో పెరుగు తింటే పిత్తా, కఫా, వాత దోషాలన్నీ ఒకేసారి ప్రభావితమవుతాయి. నిజానికి వర్షాకాలంలో వాత, పిత్త, దోషాలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఆరోగ్యానికి చాలా హానిచేస్తుంటాయి. వాతావరణం మారే కొద్ది కొత్త రోగాలు పుట్టుకొస్తుంటాయి. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం, పెరుగు కూలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో పెరుగును తినటం వల్ల జీర్ణశక్తిని వీక్ అవుతుంది.
ముఖ్యంగా అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తెలుగులో చిటికెడు ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర పొడి లేదా తేనె కలిపి తీసుకోడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. నిజానికి వర్షాకాలంలో పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో శ్లేష్మం శాతం అధికమవుతుంది. దాంతో జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువైపోతాయి.
వర్షాకాలంలో తేమ కారణంగా అలర్జీ సమస్యలు కూడా అధికంగా వస్తుంటాయి. పెరుగు తింటే అది కూడా ఎక్కువైపోతుంది. అయితే కొంతమందికి మాత్రం వాతావరణంతో సంబంధం లేకుండా భోజనంలో పెరుగుని కంపల్సరీగా వాడుతుంటారు. అలాంటివారు చిటికెడు మిరియాలపొడి, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు లేదా తేనె కలిపిన పెరుగు తినడం ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.