Phone : మీ ఫోన్ పాతబడిపోయిందా.. సెక్యూరిటీ కెమెరాగా మార్చితే సరి..!

Phone : ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ పాతబడిపోతే చాలు ఎక్స్చేంజ్ చేయడం లేదా దానిని పక్కన పడేయడం లాంటిది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న ఐడియా తో మీ పాత ఫోను మీ ఇంటికి సెక్యూరిటీ కెమెరా గా మార్చుకోవచ్చు. ఇక దీనికోసం మీరు ఎటువంటి అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ పాత మొబైల్ ను తిరిగి ఉపయోగించే బెస్ట్ ట్రిక్కుతో మీ ఇంటికి సెక్యూరిటీని కూడా అందించవచ్చు. ఇక ఇందుకోసం మీరు మీ పాత ఫోన్ లో ఒక యాప్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. మీ పాత ఫోను మీ ఇంటి సెక్యూరిటీ కెమెరాగా మార్చే ఆ బెస్ట్ ట్రిక్కు కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇకపోతే ఇందుకోసం మీరు మీ పాత ఫోన్ లో సెక్యూరిటీ కెమెరా యాప్ ను ఎంచుకోవాలి.

Advertisement

ఇక ఇలాంటి సౌకర్యంతో ఎన్నో యాప్స్ గూగుల్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు లోకల్ స్ట్రీమింగ్, క్లౌడ్ స్ట్రీమింగ్, రికార్డింగ్ ను పొందినట్లే ఫుటేజీని రిమోట్ గా లేదా స్థానికంగా స్టోరేజీ చేసే సదుపాయం కూడా ఇందులో కల్పించబడింది. అంతేకాదు మోషన్ డిటెక్షన్ అలాగే హెచ్చరికలను కూడా పొందే వీలు ఉంటుంది. ఇకపోతే మీ ఫోన్ మీరు సెక్యూరిటీ కెమెరా గా మార్చుకోవడానికి ముందుగా Alfred యాప్ ను ఉపయోగించడం ఒక ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు. ఇది క్లాస్ ప్లాట్ ఫామ్.. ఇకపోతే మీ పాత ఫోన్ ఆండ్రాయిడ్ ఫోనా లేదా లేక ఐవోయిస్ ఆధారిత యాపిల్ ఐఫోన్ కాదా అనే ఎటువంటి పట్టింపు లేదు కేవలం మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో 4.7 రేటింగ్ అలాగే 10 మిలియన్ పైగా డౌన్లోడ్స్ ను కూడా సాధించింది.

Advertisement
Is your phone old Turn it into a security camera
Is your phone old Turn it into a security camera

అందుకే ఈ యాప్ మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్రత్యక్ష ఫీడ్ యొక్క రిమోట్ యూనియన్ కూడా అందిస్తుంది అలాగే చలన గుర్తింపు కూడా లభిస్తుంది అంతేకాదు హెచ్చరికలను కూడా మీరు పొందుతారు. అంతేకాదు టూ వే ఆడియో ఫీడ్ కూడా లభిస్తుంది. ఇకపోతే మీ స్మార్ట్ ఫోన్లో Alfred యాప్ ను డౌన్లోడ్ చేసి స్టార్ట్ బటన్ ని నొక్కాలి. ఇక ఆ తర్వాత వ్యూయర్ ను పొందుతారు. దాన్ని ఎంచుకొని ముందుకు సాగితే సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. అప్పుడు గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయవచ్చు. ఇక అక్కడ వ్యూవర్ కి బదులుగా కెమెరాను ఎంచుకోవాలి . దీని తర్వాత మీరు రెండు ఫోన్లలో ఒకే ఖాతాను సైన్ ఇన్ అయ్యారని నిర్ధారించుకొని సెటప్ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో సరైన స్థలంలో ఉంచితే ఒక సెక్యూరిటీ కెమెరాగా మీకు లైవ్ ఫీడ్ ను అందిస్తుంది.

Advertisement