పిప్పి పన్నుతో బాధ పడుతున్నారా? శాశ్వత పరిష్కారం ఇదే!

నేటిదైనందిత జీవితంలో చాలామంది పిప్పి పన్నుతో బాధ పడుతూ వుంటారు. ఇక వారి బాధ ఆ దేవుడికే ఎరుక. అనుభవించినవాడికి తప్ప ఎదుటివారికి ఆ బాధ గురించి తెలియని తెలియదు. ఏది తినాలన్నా తినలేరు. ఏదైనా ఘనపదార్ధం కొరకలంటే వారికి చుక్కలు కనబడతాయి. ఎన్ని సార్లు డాక్టర్లు చుట్టు తిరిగినా తగిన ఫలితం ఉండదు, పన్ను పీకించుకోవడం తప్ప. అయితే మన భారతీయ పురాతన సంప్రదాయంలో నాటు వైద్యానికి పెద్ద పీట వేశారు. ఇప్పుడంటే అందరూ ఇంగ్లీషు మందులకు అలవాటు పడ్డారుగానీ అప్పట్లో నాటువైద్యానికి పెట్టింది పేరు మన భారతదేశం.

ఇక్కడ మనకు లభిస్తున్న ఎన్నో చెట్లు వనమూలికలుగా పనిచేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందులో సీతాఫలం ఒకటి. ఈ పేరు విననివారు వుండరు. ఈ వర్షాకాలంలో వీటి ఫలాలు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. సీతాఫలం మనకు ఏవిధంగా అయితే మేలు చేస్తుందో సీతాఫలం చెట్టు ఆకులు కూడా మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. సీతాఫలం చెట్టు ఆకుల్లో హైడ్రోస్థెనిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ చెట్టు ఆకులకు పసుపును కలిపి బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర దురదలు వంటి చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.

అలాగే సెగ గడ్డలతో బాధపడే వారు సీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ గడ్డలపై ఉంచి ఓ కట్టు కడితే సెగ గడ్డల సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు. అలాగే సాధారణంగా స్త్రీలు అవాంఛిత రోమల సమస్యతో ఎక్కువగా బాధపడుతూ వుంటారు. అలాంటి వారు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ అవాంఛిత రోమాలపై రాసి అరగంట పాటు ఉంచి, తరువాత నీటితో కడిగితే అవాంఛిత రోమాల సమస్య నుండి చాలా ఈజీగా శాశ్వతంగా బయటపడవచ్చు. అంతేకాకుండా సీతాఫలం చెట్టు ఆకులతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణుల మాట.

ఇక అన్నింటికి మించి పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో సీతాఫలం ఆకు చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుందని చెబుతుతోంది మన ఆయుర్వేదం. ఓ చిన్న టిప్ పాటించడం ద్వారా ఆ సమస్యను పూర్తిగా నివారించవచ్చని సూచిస్తున్నారు. దీనికోసం మీరు రెండు లేదా మూడు సీతాఫలం ఆకులను తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి, తరువాత వాటికి నాలుగు లేదా ఐదు మిరియాలను కలిపి ఒక లేహ్యంగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిప్పి పన్ను సైజులో ఉండగా చుట్టుకోవాలి. ఈ ఉండను పిప్పి పన్ను వల్ల కలిగిన రంధ్రంలో ఉంచి అలాగే నొక్కి పెట్టాలి. ఇలా రోజుకొకసారి చేయడం వల్ల పిప్పి పన్ను సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయుర్వేద టిప్ ని పాటించి పిప్పి పన్ను సమస్యని వెంటనే దూరం చేసుకోండి.