IPHONE:ఐఫోన్ 12 మినీ పై రూ.25వేల వరకు డిస్కౌంట్.. త్వరపడండి..!

టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా లాంచ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 7వ తేదీన జరిపిన విషయం తెలిసిందే. ఇందులో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ లో నాలుగు ఐఫోన్లతో పాటు యాపిల్ అల్ట్రా వాచ్ అలాగే యాపిల్ ప్రోడక్ట్లను లాంచ్ చేసింది. ఇవన్నీ కూడా కస్టమర్లను ఆకట్టుకోవడమే కాదు మరింతగా అమ్ముడుపోతున్నాయి. ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా గతంలో రిలీజ్ అయిన పాత తరం ఐఫోన్ లపై కంపెనీ ధరలను భారీగా తగ్గిస్తుంది యాపిల్ సంస్థ ఇప్పుడు ఐఫోన్ 12 మినీ డివైస్ ను ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్ తి మీరు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ వాడాలని ఎవరైతే కలలు కంటున్నారో అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి.

ముఖ్యంగా ఈసారి ఐఫోన్ 14 సిరీస్ లో మినీ మోడల్ ను కంపెనీ తీసుకురాలేదు. అయితే కంపాక్ట్ ఐఫోన్ మినీ ని ఇష్టపడే వారికి ఓల్డ్ జనరేషన్ మినీ మోడల్స్ తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఐఫోన్ 12 సిరీస్ లో వచ్చిన మినీ ఎడిషన్ బాగా పాపులర్ అయింది . అయితే ఈ డివైస్ ఇప్పుడు అమెరికన్ టెలీ కమ్యూనికేషన్ కంపెనీ AT &T స్టోర్ అది తక్కువ ధరకే అందిస్తూ ఉండడం గమనార్హం. ఇంకా అమెరికాలో ఉన్న ఈ స్టోర్ లో ఐఫోన్ 12 మినీ పై అందించే డిస్కౌంట్ వివరాలను వెల్లడించింది. ఇక దీని కొనుగోలుపై కస్టమర్లు సుమారుగా రూ.25 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.. నిజానికి ఐఫోన్ 12 మినీ అసలు ధర రూ.50 వేలకు పైనే ఉంటుంది. అంటే దీనిని ఇప్పుడు సగానికి పైగా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఐఫోన్ 12 మినీ 64 GBమోడల్ ఎలాంటి ట్రేడింగ్ లేకుండా రూ.25 వేలకే లభిస్తూ ఉంది. ముఖ్యంగా అర్హత కలిగిన యూజర్లు, పోస్ట్ పెయిడ్ AT &T అన్లిమిటెడ్ వైర్లెస్ సర్వీస్ ను ఎంచుకుంటే 25 వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎస్ డి ఆర్ డిస్ప్లే తో ఓ ఎల్ ఈ డి ప్యానెల్ తో వస్తుంది. 12+12MP రియర్ లెన్స్,12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. 20W ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే 2227 ఎం ఏ హెచ్ నిత్యం అయాన్ బ్యాటరీ ను కలిగి ఉంది. ఇక వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ దీని సొంత మని చెప్పవచ్చు.

Advertisement