Internet : ప్రస్తుతం ఎక్కడ చూసినా 5G నెట్వర్క్ కోసం కస్టమర్లు ఎక్కువగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో 4G ఇంటర్నెట్ పైన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇకపోతే ఎలాంటి హై స్పీడ్ నెట్వర్క్ ఉన్నా సరే మీ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతే మాత్రం ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవడం సాధ్యపడదు. అలాంటప్పుడు మీ ఫోన్లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ ను ఇట్టే పెంచవచ్చు. సాధారణంగా చాలాసార్లు మనం అనుకున్న దానికంటే వేగంగా నెట్వర్క్ స్పీడు ఉండకపోవచ్చు అందుకే మీ స్మార్ట్ ఫోన్ యొక్క 4G ఇంటర్నెట్ వేగాన్ని మరింతగా పెంచడానికి ఇప్పుడు కొన్ని టిప్స్ తీసుకురావడం జరిగింది. ఇక మరి వాటి గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం.
మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడెను ఆన్ చేయాలి: ముఖ్యంగా మొబైల్ ను పునఃప్రారంభించడంతోపాటు మీరు మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ని కూడా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఈ విధానంలో మీ ఫోన్ మళ్ళీ మొబైల్ ను నెట్వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి మీ ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని కూడా పెంచుతుంది. మీకు ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు అనిపిస్తే ఇలా ఫ్లైట్ మోడ్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి. మొబైల్ ఫోను రీస్టార్ట్ చేయడం: ఇది అత్యంత మొదటి సులభమైన మార్గమని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు మీ ఫోన్ ను రీస్టార్ట్ చేయడం వల్ల మీ మొబైల్ కొత్త నెట్వర్క్ ను వెతుకుతుంది. అప్పుడు ఇంటర్నెట్ వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ మొబైల్ ఫోన్లో నెట్వర్క్ తక్కువగా ఉన్నా సరే ఇలా ఒకసారి రీస్టార్ట్ చేయడం మంచిది.
అంతేకాదు మీరు వినియోగిస్తున్న డేటా వినియోగాన్ని కూడా తనిఖీ చేయడం మంచిది.. ఒక్కొక్కసారి రోజు వారీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం పడిపోతుంది. ఈ సందర్భంలో కూడా మీరు డేటా వినియోగాన్ని పరిశీలించిన తర్వాత ఒకవేళ రోజు వారి డేటా అయిపోతే నెట్వర్క్ రీఛార్జి ప్లాన్స్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆటో డౌన్లోడ్ అప్డేట్ ని కూడా నిలిపివేయాలి.. అలాగే ఫోన్ యొక్క నెట్వర్క్ సెట్టింగ్లను కూడా రీసెట్ చేయడం మంచిది.. ఈ టిప్స్ గనుక ఫాలో అయితే కచ్చితంగా మీ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ వేగాన్ని పెంచవచ్చు.