Swetha case : విశాఖపట్నంలో వివాహిత శ్వేత మృతి కేసులో ఉన్నకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు నెలల గర్భిణీ అయినా శ్వేతనీ 90 సెంట్లు భూమి విషయంలో గొంతు పట్టుకుని దాడి చేయడం జరిగిందని స్పష్టం చేశారు. అంతేకాదు ఆడపడుచు కూడా శ్వేతాను తక్కువ చేసి మాట్లాడేది. ఆడపడుచు భర్త సత్యం అయితే శ్వేతాన్ని లైంగికంగా వేధించడం జరిగింది. దీంతో మనస్థాపం చెంది శ్వేతా ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు, సత్యం పై కేసు నమోదు చేసినట్లు సీపీ స్పష్టం చేశారు.

ఇంకా ఈ కేసులో భర్తతో శ్వేత మాట్లాడిన ఫోన్ కాల్స్.. మరియు సిసి ఫుటేజ్ లు కీలకం కానున్నట్లు స్పష్టం చేశారు.ఇంకా ఇవే విషయాలు శ్వేత తల్లి సైతం పోలీసులకు తెలియజేయడం జరిగింది. తన కూతురు మణికంఠ కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే మరణించినట్లు.. శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.